పాస్టర్ హత్యకేసులో వీడిన మిస్టరీ హంతకురాలు కూతురే!
ఖమ్మం, ఫిబ్రవరి 2 (): ఖమ్మం పట్టణంలో హత్యకు గురైన చర్చి ఫాదర్ ప్రేమ్‌దాస్ హత్యకేసు మిస్టరీ వీడింది. ఎస్టీ కార్యాలయం రోడ్డులో నివాసం ఉంటున్న హత్యకు గురైన విషయం విధితమే. ఈ కేసులో పాస్టర్ చిన్న కుమార్తే, ముగ్గురు యువకులు ఓ వృద్ధారాలిని పోలీసులు విచారించారు. ఈ హత్యకేసులో విచారణ దాదాపు పూరైంది. పాస్టర్ కుమార్తె పికె హతమార్చినట్టు పోలీసుల ఎదుట అంగీకరించినట్టు తెలిపారు. ఎస్పీ రంగనాథ్, డిఎస్పీ సునీత, ఇన్‌స్పెక్టర్ శ్రీనవాసరెడ్డి ఆమెతో మాట్లాడి వివరాలు స్వీకరించారు. ఆరోజు సాయంత్రం సినిమా నుంచి ఆమె రాగానే తండ్రి ప్రశ్నించారు. కోపొద్రిక్తురాలైన కూతురు తండ్రిపై చేయి జేసుకుంది. ఒక్కసారిగా కిందపడ్డాడు. అనంతరం ఊపిరాడకుండా దిండుతో కూతురు తండ్రిని చంపేసింది. హత్య తనపై రాకుండా దోపిడీ దొంగలు చేసినట్లుగా కాళ్ళు, చేతులకు తాళ్ళు కట్టి పక్కన కారం చల్లినట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది.