*పిడిఎస్యు జిల్లా జనరల్ కౌన్సిల్ ను జయప్రదం చేయండి*

– పిడిఎస్యు జిల్లా అధ్యక్షుడు పుల్లూరి సింహాద్రి

మునగాల, జూలై 28(జనంసాక్షి): సూర్యాపేట పట్టణంలో ఈ నెల 31వ తేదీన జరిగే పిడిఎస్యు జిల్లా జనరల్ కౌన్సిల్ పోస్టర్ ను మునగాల మండల కేంద్రంలో గురువారం  పిడిఎస్యు జిల్లా అధ్యక్షుడు పుల్లూరి సింహాద్రి ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా పిడిఎస్యు జిల్లా అధ్యక్షుడు పుల్లూరి సింహాద్రి మాట్లాడుతూ, ఎన్నో పోరాటాలు 1200మంది విద్యార్థుల ఆత్మబలిదానలతో ఏర్పడిన తెలంగాణ రాష్ర్టంలో విద్యా రంగం నిర్లక్ష్యానికి గురవుతూనే వుందన్నారు. కేజీ నిండి పిజి వరకు ఉచిత విద్య అందిస్తానని చెప్పి రేషనలైజషన్ పేరుతో ఉన్న పాఠశాలలను మూసివేస్తున్నరని అవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలు ప్రారంభం అయి నెల గడుస్తున్నా నేటికీ పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు అందిచకుంటే విద్యార్ధులు విద్యను ఎలా అభ్యసించాలో పాలకులు చెప్పాలని ప్రశ్నించారు. మన ఊరు – మన బడి వంటి ఆకర్షణీయమైన పేర్లతో ఏదో ఉద్దరిస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు తప్ప ఏ ఒక్క హామీ కూడా నేటికీ అమలులోకి రాలేదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయకుండా ప్రభుత్వ విద్యా సంస్థలు విద్యార్థులను కార్పొరేట్ పరం చేసే ప్రయత్నాలు చేస్తూ, ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలకు ఫీజు నియంత్రణ చట్టాలు అమలు చేయకుండా అధికారులు, ప్రభుత్వ పెద్దలు కొమ్ముకాస్తున్నరని అన్నారు. మరో వైపు పేద విద్యార్థులకు స్కాలర్షిప్స్, ఫీజ్ రీయింబర్స్మెంట్ సకాలంలో విడుదల చేయకుండా కాలయాపన చేస్తూ కార్పొరేట్ శక్తులకు ఉత్తమిస్తున్నరని అన్నారు. అదే విధంగా రాష్ట్రంలో ఉన్న సంక్షేమ హాస్టల్స్ కి పక్క భవనలు నిర్మించి, అప్లయ్ చేసుకున్న ప్రతి ఒక్క విద్యార్ధికి హాస్టల్ వసతి కల్పించాలని కోరారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన విద్య విధానం 2020ను, పాఠ్యాంశాలలో మతాన్ని చేరుస్తూ విద్యకషయకరణ చేస్తూ పేద విద్యార్థులను విద్యకు దూరం చేస్తున్నారని అవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భాలలో విద్యారంగ పరిరక్షణకు, విద్యార్థి హక్కుల కోసం విద్యార్థులలో శాస్త్రీయ విలువల్ని, మానవీయ సంస్కృతిని పెంపొందించడానికి ఈ నెల 31న సూర్యాపేట పట్టణంలో  పిడిఎస్యు జిల్లా జనరల్ కౌన్సిల్ ను నిర్వహిస్తుందని తెలిపారు. ఈ కౌన్సిల్ కు విద్యార్ధులు జిల్లా నలుమూలల నుండి వచ్చి జయప్రదం చేయాలని పిలపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్యు నాయకులు లక్ష్మణ్, గోపి, ఈశ్వర్, విన్ను, వీరబాబు, నాని, మహేష్, శివ, యశ్వంత్, నాగరాజు తదితరలు పాల్గొన్నారు.