పిడుగుపాటుకు గురై రైతు భూక్య హుస్సేన్ మృతి

 

 

 

 

 

 

 

 

కురవి అక్టోబర్-18 (జనం సాక్షి న్యూస్)కురవి అక్టోబర్-18 (జనం సాక్షి న్యూస్)
పిడుగుపాటుకు గురై వ్యక్తి మృతిచెందిన ఘటన కురవి మండలంలోని జగ్యా తండా గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది.ఎస్‌ఐ రాములు నాయక్ తెలిపిన వివరాలు ప్రకారం జగ్గయ్య తండాకి చెందిన భూక్య హుస్సేన్ (42) తన మిరప తోటలో నాగలి దున్నుతూ ఉండగా  మధ్యాహ్న సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం రావటంతో అదే సమయంలో పిడుగుపడి హుస్సేన్ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని  మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం చేసిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతునికి భార్య బద్రి ,కుమారుడు, కుమార్తె ఉన్నారు. పిడుగు పడి ఒక్కసారిగా హుస్సేన్ మృతి చెందడంతో తండాలోని విషాదఛాయలు అలుముకున్నాయి.