పి వై ఎల్ రాష్ట్ర మహాసభ పోస్టర్ల ఆవిష్కరణ

పి వై ఎల్ రాష్ట్ర మహాసభ పోస్టర్ల ఆవిష్కరణ

జిల్లా కార్యదర్శి వాంకుడోత్ అజయ్..ఇల్లందు అక్టోబర్ 9 (జనం సాక్షి న్యూస్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు
ప్రగతిశీల యువజన సంఘం పివైఎల్ 8వ రాష్ట్ర మహాసభల పోస్టర్లను సోమవారం ఎల్లన్న విజ్ఞాన భవనంలో ఈ సోమవారం రోజు ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి వాంకుడోత్ అజయ్ మాట్లాడుతూ అక్టోబర్ 12, 13 తేదీలలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సంఘం మహాసభలను నిర్వహించుకుంటున్నామని, త్యాగాలకు, పోరాటాలకు పురిటి గడ్డ మానుకోట జిల్లా కేంద్రంలో ఈ మహాసభలు జరుపుకోవడం ఆనందకరంగా ఉందన్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని యువకులకు హామీలు ఇచ్చి అధికార పగ్గాలు చేపట్టిన నరేంద్ర మోడీ ఉద్యోగాల కల్పనలో పూర్తిగా విఫలమయ్యాడని అన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో యువతకు ఇంటికో ఉద్యోగం వస్తదని, ఆశిస్తే కెసిఆర్ ఊరుకో ఉద్యోగం కూడా ఇవ్వలేదు. తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలనలో లక్ష ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదంటే నిరుద్యోగుల పట్ల ఎంత కఠినాత్మకంగా ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. నిరుద్యోగులు రాష్ట్ర ప్రభుత్వంపై గల మెత్తాల్సిన అవసరం నేడు ఉన్నదన్నారు. యువతరం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు పోరాటాలు రూపకల్పన చేసుకునే అందుకు ఈ మహాసభలు దోహదపడతాయని ఆశిస్తున్నామని అన్నారు ఈ మహాసభలకు యువతరం కదిలి వచ్చి జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సిపిఐ (ఎంఎల్) ప్రజాపందా ఇల్లందు పట్టణ కార్యదర్శి యాకుబ్ షావలి, సిపిఐ(ఎంఎల్ )ప్రజాపందా జిల్లా నాయకులు ఆర్ఎస్సి బోస్, బుర్ర వెంకన్న పూణే కుమార్, పాయం వెంకన్న తదితరులు పాల్గొన్నారు.