పి హెచ్ సి లో కంటి వైద్య శిబిరం

ఏర్గట్ల అక్టోబర్ 20 ( జనంసాక్షి ): నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రంలోని పి హెచ్ సి సెంటర్ లో గురువారం రోజున వైద్య అధికారి స్టెపి రాణి ఆధ్వర్యంలో డాక్టర్ భుజంగా రెడ్డి  కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు . దీనిలో 48 మందికి వైద్య పరీక్షలు చేయగా 17 మందికి మోతే బిందులు ఉన్నట్టు నిర్ధారించారు. వీరిని శస్త్ర చికిత్స కొరకై నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి రమ్మని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎం పీ హెచ్ ఎ  పండరి, ఫార్మసిస్ట్ లు సుమలత, దివ్య పాల్గొన్నారు.