పీడ కలలు వస్తున్నాయి: వరుణ్ ఆరోన్ బౌన్సర్‌పై స్టువర్ట్ బ్రాడ్

sp-3 సిడ్నీ: భారత బౌలర్ వరుణ్‌ ఆరోన్‌ వేసిన బౌన్సర్‌ ముఖానికి తగలడంతో కలిగిన భయం నుంచి తానింకా తేరుకోలేదని ఇంగ్లాండ్‌ పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ తెలిపాడు. నిరుడు మాంచెస్టర్‌లో భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య నాలుగో టెస్టు సందర్భంగా ఆరోన్‌ వేసిన బంతి బ్రాడ్‌ బ్యాట్‌‌ అంచును తగిలి అతడి హెల్మెట్‌ గ్రిల్స్‌ నుంచి లోపలికి దూసుకెళ్లింది. దీంతో బ్రాడ్‌ ముక్కుకు, కంటికి గాయాలయ్యాయి. దీంతో ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చింది. ఆ ఘటనకు సంబంధించి ఇప్పటికీ తనకు పీడకలలు వస్తున్నాయని బ్రాడ్‌ చెప్పాడు. ‘ఇప్పటికీ నాకు పీడకలలు వస్తున్నాయి. బంతి ముఖానికి తగిలినట్లనిపించి నిద్ర లేస్తున్నా. అలసిపోయినప్పుడు కూడా బంతులు నావైపు దూసుకొస్తున్నట్లు, దవడకు తగిలినట్లు అనిపిస్తుంది. ఆ బౌన్సర్‌ నా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది’ అని బ్రాడ్‌ పేర్కొన్నాడు. పీడ కలలు వస్తున్నాయి: వరుణ్ ఆరోన్ బౌన్సర్‌పై స్టువర్ట్ బ్రాడ భారత బౌలర్లను కాచుకోండి: హర్భజన్ పెర్త: వెస్టిండీస్‌తో జరిగే మ్యాచ్‌లో టీమ్‌ఇండియానే ఫేవరెట్‌ అని భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్ అన్నాడు. భారత్‌ ఇప్పుడున్న స్థితిలో వారి సామర్థ్యంలో 75 శాతం వాడినా…వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేయగలరని తెలిపాడు. ధోని సేనపై గెలవాలంటే విండీస్‌ సర్వశక్తులూ ఒడ్డక తప్పదని పేర్కొన్నాడు. ఐతే కరీబియన్‌ జట్టులో ప్రతిభావంతులకు కొదవ లేదదని తెలిపాడు. జట్టుగా ఆడకుండా ఎవరో ఒకరిని నమ్ముకోవడం వారిని దెబ్బ తీస్తోందని అభిప్రాయపడ్డాడు. శ్రీలంకలో టి20 ప్రపంచకప్‌లో మాత్రమే విండీస్‌ కలిసికట్టుగా ఆడి ట్రోఫీ గెలుచుకుందని తెలిపాడు. బలమైన జట్లతో ఆడేటప్పుడు జట్టులో ఇద్దరు, ముగ్గురు ఆటగాళ్లు రాణించాల్సి ఉంటుందన్నాడు. గేల్‌, శామ్యూల్స్‌ త్వరగా ఔటైతే… ఆ జట్టు రాణించలేకపోతోందని అభిప్రాయపడ్డాడు. ఆరంభంలోనే వికెట్లు పడితే సింగిల్స్‌, రెండు పరుగులతో స్కోరు తగ్గకుండా చూడాలని, ఈ విషయంలో విండీస్‌ కన్నా ధోని సేన ముందుంటుందని పేర్కొన్నాడు. వాకా పిచ్‌పై సత్తా చాటగలమని విండీస్‌ అనుకుంటూ ఉండొచ్చని, ఐతే ఆ జట్టు బ్యాట్స్‌మెన్‌ భారత బౌలర్లను ఎదుర్కోవడంపై మొదట దృష్టి పెట్టాలని తెలిపాడు.