పీవీకి పలువురు ప్రముఖుల ఘన నివాళి
హైదరాబాద్, జూన్ 28(జనంసాక్షి)
ఆర్థిక సంస్కరణల పితామహడు, బహు భాషా కో విదుడు, మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహారావు 94వ జయంతి ఘనంగా జరిగింది. తెలంగాణ ప్రభు త్వం అధికారికంగా నిర్వహించిన జయంతి వేడుకల్లో వివిధ పార్టీల నేతలు కూడా పాల్గొన్నారు. దేశానికి పీవీ చేసిన సేవలు చిరస్మరణీయమని కాంగ్రెస్ నేత లు కొనియాడారు. పీవీకి భారత రత్న ఇవ్వాలని ఆ యన కుటుంబ సభ్యులు కోరారు. మరోవైపు పీవీ గొ ప్ప అనుభవమున్న
రాజకీయవేత్తగా ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్‌లో నివాళులర్పించారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లోని పీవీ ఘాట్‌లో జయంతి వేడుకలు జరిపింది. జ్ఞానభూమి వద్ద సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ మంత్రులతో పాటు రెండు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ నేతలు కూడా హాజరై పీవీకి ఘనంగా నివాళులర్పించారు.
పీవీని కొనియాడిన నేతలు…
సీఎంగా, ప్రధానిగా పీవీ చేసిన సేవలను కొనియాడారు తెలంగాణ మంత్రులు. భారత్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడానికి, దేశంలో ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు పీవీ నరసింహారావు అని అన్నారు. ప్రతిపక్ష పార్టీలు పీవీ నరసింహరావును స్మరించుకోవడం.. శుభపరిణామమని పీవీ తనయుడు రాజేశ్వర్‌రావు అన్నారు. పీవీకి భారతరత్న వచ్చేందుకు కాంగ్రెస్ కేంద్రానికి సిఫార్సు చేయాలని కోరారు. టీ కాంగ్రెస్ నేతలు కూడా పీవీకి నివాళులు అర్పించారు. దేశంలో పారిశ్రామిక విప్లవానికి కృషి చేశారని అన్నారు.
గాంధీ భవన్ లో..
అటు గాంధీభవన్‌లోనూ పీవీ జయంతి కార్యక్రమం జరిగింది. దేశానికి పీవీ నరసింహరావు సేవలు మరువలేనివని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ చెప్పారు. ప్రజల వెన్నంటి ఉండి వారికోసం పనిచేయడం ద్వారానే పీవీకి నిజమైన నివాళి అన్నారు.
మోడీ ట్విట్టర్ లో నివాళులు…
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతిని పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్‌లో నివాళులర్పించారు. పీవీని గొప్ప అనుభవమున్న రాజకీయనేతగా అభివర్ణించారు.