పీవీ సింధును అభినందించిన సీఎం
హైదరాబాద్, జనంసాక్షి: మలేషియా ఓపెన్ గ్రాండ్ ప్రీ టైటిల్‌ను గెలుచుకున్న భారత రైజింగ్ స్టార్ పీవీ సింధును సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అభినందించారు. సింధు తల్లిదండ్రులు కూడా హర్షం వ్యక్తం చేశారు. మున్ముందు మరిన్ని విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు. మలేషియా ఓపెన్ గ్రాండ్ ప్రీ ఫైనల్లో సింగపూర్ షట్లర్ జువాన్‌జువై 21-17-,17-21,21-19 తేడాతో సింధు విజయం సాధించారు.


