పురపాలక సంఘం కార్యాలయం పెద్దబొడ్డేపల్లి తరలించడం పై అభ్యంతరం తెలుపుతూ ఆర్డీవోకు వినతిపత్రం..


నర్సీపట్నం పురపాలక సంఘం కార్యాలయం నర్సీపట్నం నుండి అభ్యతరకరమైన స్థలములో నిర్మించిన అధికార్లపైన, నిభందనలకు విరుద్ధంగా మున్సిపల్ కార్యాలయం తరలించిన కమీషనర్ పై చర్యలు చేపట్టాలి
నర్సీపట్నం ఫిబ్రవరి 14 (జనంసాక్షి) :
నర్సీపట్నం పురపాలక సంఘం కార్యాలయంను నర్సీపట్నం నుండి పెద్దబొడ్డుపల్లికు అధికారులు తరలించిన విషయం తెలిసిందే – సదరు కార్యాలయం తరలించడం నిబంధనలకు విరుద్ధం అని  గౌరవ అత్యున్నత న్యాయస్థానం తీర్పు ప్రకారం, ప్రజాప్రయోజనం దృష్ట్యా తగు చర్యల చేపట్టాలని సోమవారం ఆర్డీవో కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో బలిఘట్టం పూర్వ పంచాయతీ ప్రాంత ప్రజల తరుపున వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బలిఘట్టం పూర్వ పంచాయతీ ప్రాంత ప్రజల సభ్యులు మాట్లాడుతూగతంలో మొదటి పాలక వర్గం నర్సీపట్నంలోనే కార్యాలయం ఉండాలని తీర్మానం చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగిందన్నారు.కానీ ప్రస్తుతం పాలకవర్గం సదరు కార్యాలయంపై ఎటువంటి తీర్మానం చేయలేదని అన్నారు. పెద్దబొడ్డేపల్లికి తరలించిన కార్యాలయం యొక్క స్థలము రెవెన్యూ రికార్డుల ప్రకారం సర్వే నెంబరు 127 (కొత్త బంధ), సర్వే నెం. – 132 (రుద్రభూమి) అయినందున గౌరవ న్యాయస్థానం తీర్పు ప్రకారం అభ్యంతరం తెలియజేస్తూ ఆర్ సి  నెం. 153/2013/B/తేదీ 02/03/2013 న తహశీల్దారు , మున్సిపల్ కమీషనర్ కు తెలియజేయడం జరిగిందన్నారు. పెద్దబొడ్డేపల్లికు కార్యాలయం తరలించడం వలన కళ్ళెంపూడి, కృష్ణాపురం, సీతయ్యపాలెం, కె. బయ్యపురెడ్డి పాలెం, పి.బయ్యపురెడ్డి పాలెం, లింగాపురం, బలిఘట్టం గ్రామాలకు చాలా దూరం అయినందుకు సదరు కార్యాలయం పని నిమిత్తం వెళ్ళాలంటే వ్యయ ప్రయాసలకు ప్రజలు ఇబ్బంది పడవలసి వస్తుందని వాపోయారు. నర్సీపట్నం లోనే మున్సిపల్ కార్యాలయం ఉంచడం వలన, అన్ని కార్యాలయాలు సర్సీపట్నంలోనే ఉన్నందున పనిబాట్లుకు అత్యంత సౌలభ్యం వుంటుందన్నారు. కాబట్టి దయవుంచి గౌరవ న్యాయస్థానం తీర్పు దిక్కరించి కార్యాలయంను అభ్యతరకరమైనస్థలములో నిర్మించిన అధికార్లపైన, నిభందనలకు విరుద్ధంగా నర్సీపట్నం నుండి పెద్దబొడ్డేపల్లికు కార్యాలయం తరలించిన కమీషనర్ పై చర్యలు తీసుకొని, ప్రజల సౌలభ్యం కొరకు నర్సీపట్నంలోనే మున్సిపల్ కార్యాలయం ఉండేలా చూడాలని కోరారు.