పురానాపూల్‌లో రీపోలింగ్‌

4

హైదరాబాద్‌,ఫిబ్రవరి 4(జనంసాక్షి): పాతబస్తీలోని పురానాపూల్‌ డివిజన్‌లో రీపోలింగ్‌ జరపాలని తెలంగాణ ఎన్నికల సంఘం నిర్ణయించింది. గొడవల కారణంగా ఇక్కడ రీపోలింగ్‌ జరపాలని నిర్ణయించి ఈ మేరకు ఆదేవించారు. దీంతో  పురానాపూల్‌ డివిజన్‌లో శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రీపోలింగ్‌ నిర్వహించాలని ఈసీ ఆదేశాలు జారీచేసింది. దీంతో 36 కేంద్రాల్లో రీపోలింగ్‌కు ఏర్పాట్లు చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ సిబ్బందిని ఆదేశించగా అందుకు ఏర్పాట్లు చేశారు. మంగళవారం జరిగిన గ్రేటర్‌ ఎన్నికల సందర్భంగా పురానాపూల్‌లో కాంగ్రెస్‌, ఎంఐఎం పార్టీల మధ్య ఘర్షణ తలెత్తిన సంగతి తెలిసిందే. విూర్‌చౌక్‌ పోలీస్‌స్టేషన్‌ వద్ద టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మండలిలో విపక్షనేత షబ్బీర్‌అలీపై ఎంఐఎం కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. దీనిపై ఆందోళన వ్యక్తం చేసిన కాంగ్రెస్‌ పార్టీ అఖిలపక్షం ఆధ్వర్యంలో ఎన్నికల కమిషనర్‌, గవర్నర్‌లకు ఫిర్యాదు చేసింది. దాడికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని, పురానాపూల్‌లో రీపోలింగ్‌ నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. దీనిపై సవిూక్షించిన ఎన్నికల సంఘం పురానాపూల్‌లో రీపోలింగ్‌ నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో ఇక్కడ ఎన్నిక తరవాత శనివారం కౌంటింగ్‌ జరిపే అవకాశం ఉంది. పాతబస్తీలోని పురానాపూల్‌ డివిజన్‌లో రీపోలింగ్‌ జరపాలని తెలంగాణ ఎన్నికల సంఘం నిర్ణయించింది. పురానాపూల్‌ డివిజన్‌లో శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రీపోలింగ్‌ నిర్వహించాలని ఈసీ ఆదేశాలు జారీచేసింది. దీంతో రీపోలింగ్‌కు ఏర్పాట్లు చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్ధన్‌రెడ్డి సిబ్బందిని ఆదేశించారు. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ, ఆయన అనురుల వీరంగం వల్ల కొందరు ఓటర్లు ఓటు వేయలేకపోయారు. దీంతో ఈసీ రీపోలింగ్‌కు ఆదేశించింది. 36 పోలింగ్‌ కేంద్రాల్లో రేపు రీపోలింగ్‌ నిర్వహించాలని నిర్ణయించారు. 34,413 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇదిలావుండగా  పాతబస్తీలోని పూరానాపూల్‌ డివిజన్‌లో శుక్రవారం జరగనున్న రీ పోలింగ్‌కు డీసీపీ సత్యనారాయణను దూరంగా ఉంచాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. పూరానాపూల్‌లో మంగళవారం జరిగిన పోలింగ్‌ సందర్భంగా కాంగ్రెస్‌, ఎంఐఎం శ్రేణుల మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ డివిజన్‌లో రీపోలింగ్‌ నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. అయితే పోలింగ్‌ సందర్భంగా డీసీపీ సత్యనారాయణ వ్యవహరించిన తీరుపైనా ఫిర్యాదులు రావడంతో ఎన్నికల విధులకు ఆయనను దూరం ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది.52 డివిజన్‌ పూరానాపూల్‌లోని

36 పోలింగ్‌ బూత్‌లలో శుక్రవారం ఉదయం 7గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. 34,413 మంది ఓటర్లు తమ ఓటు హక్కును

వినియోగించుకోనున్నారు. 225 మంది ఎన్నికల సిబ్బంది పోలింగ్‌ విధుల్లో పాల్గొంటారు.  ఈ రీపోలింగ్‌ కారణంగానే జీహెచ్‌ఎంసీ ఎన్నికల కౌటింగ్‌ ను శుక్రవారం మధ్యాహ్నం ప్రారంభించి.. సాయంత్రం ఐదు గంటల తర్వాత ఫలితాలు ప్రకటించాలని అధికారులు నిర్ణయించారు.