పువ్వులను పూజించే గొప్ప సంస్కృతి మనది.

శ్రీ సాయి మేధ, ఆపిల్ కిడ్స్ పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి.
తాండూరు, అక్టోబర్ 13(జనంసాక్షి) తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలలో భాగంగా పూలను పూజించే గొప్ప సాంస్కృతి మనదని శ్రీ సాయి మేద ఆపిల్ కిడ్స్ పాఠశాలల కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని శ్రీ సాయి మేధ విద్యాలయ, ఆపిల్ కిడ్స్ పాఠశాలలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలను ఒక్కచోట చేర్చి టీచర్స్ విద్యార్థులు ఆడి పాడారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి, ప్రిన్సిపల్ వనజ మాట్లాడుతూ పువ్వులను పూజించే గొప్ప సంస్కృతి మనదన్నారు. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాన్ని చాటి చెబుతుందని తెలిపారు. తెలంగాణ జీవన విధానానికి ప్రతిబింబంగా బతుకమ్మ అద్దం పడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.