పుష్కరాలపై అప్రమత్తంగా ఉండండి

1
– పటిష్ట చర్యలకు సీఎం కేసీఆర్‌ సమీక్ష

హైదరాబాద్‌,జులై17(జనంసాక్షి): గోదావరి పుష్కరాలపై సీఎం కేసీఆర్‌ సవిూక్ష నిర్వహిచారు. నాలుగు రోజులుగా జరుగుతన్న పుస్కరాల తీరును అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు జరగిన పుస్కరాల్లో భక్తులు భారీగా వచ్చి పుష్కర స్నానాలు చేయడం, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కపోవడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఈ సమావేశానికి సీఎస్‌ రాజీవ్‌శర్మ, డీజీపీ అనురాగ్‌ శర్మతోపాటు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రేపు, ఎల్లుండి సెలవు దినాలు కావడంతో పుష్కర స్నానం చేసే భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అన్నారు. ఈమేరకు పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఒక్క ధర్మపురిలోనే ఇప్పటి వరకు సుమారు 4 లక్షల మందికిపైగా భక్తులు పుష్కర స్నానం చేశారని పేర్కొన్నారు. ఇతర ప్రాంతాల్లో కూడా లక్షల సంఖ్యలో పుష్కర స్నానాలు చేస్తున్నారని తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నందున అన్ని విధాలా సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. భద్రాచలంతో సహా ఇతర పుష్కర స్నానాలు ఆచరించే ప్రదేశాలను హెలికాప్టర్‌ ద్వారా పర్యవేక్షించాలని డీజీపీని ఆదేశించారు. పుష్కరాలు జరిగే ప్రాంతాల్లో పర్యవేక్షణ కోసం కొందరు మంత్రులను కూడా పంపాలని నిర్ణయించారు.