పుష్కర సమయం

C

– ఏర్పాట్లపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

– రేపు ముఖ్యమంత్రి దంపతుల గొందిమళ్ల స్నానం

– జోగుళాంబఆలయ దర్శనం

హైదరాబాద్‌,ఆగస్టు 10(జనంసాక్షి): కృష్ణా పుష్కరాల ఏర్పాట్లపై సీఎం కేసీఆర్‌ అధికారిక నివాసంలో సవిూక్ష నిర్వహించారు. వరుస సెలవుల కారణంగా భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశమున్నందున..వారికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేసినట్లు మంత్రులు సీఎం కేసీఆర్‌కు తెలిపారు.భారీ వర్షాల ధాటికి ప్రాజెక్టులు నిండుతున్న నేపథ్యంలో నీటి విడుదలలో జాప్యం చేయొద్దని సీఎం కేసీఆర్‌ మంత్రులు, అధికారులకు నిర్దేశించారు. మొదటి స్నాన ఘట్టం నుంచి ఆఖరి స్నానఘట్టం వరకు పుష్కలమైన నీరు ప్రవహిస్తుండటం పట్ల సీఎం కేసీఆర్‌ సంతోషం వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్‌, నల్లగొండ జిల్లాల్లో 81 పుష్కరఘాట్ల నిర్మాణ పనులపై సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు.ఆగస్టు 12న ఉదయం 5.58 నిమిషాలకు మహబూబ్‌నగర్‌ జిల్లా గొందిమళ్లలో సీఎం కేసీఆర్‌ దంపతులు పుష్కర స్నానమాచరించనున్నారు. పుష్కరస్నానం అనంతరం జోగుళాంబ అమ్మవారిని సీఎం కేసీఆర్‌ దంపతులు దర్శించుకోనున్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌ రేపు సాయంత్రం ఆలంపూర్‌కు చేరుకోనున్నారు.

రేపు గొందిమళ్లలో సిఎం కెసిఆర్‌ దంపతుల పుష్కర స్నానం

తెలంగాణ రాష్ట్రంలో పుష్కరాల ముహూర్తం ఖరారైంది. ఈ నెల 12న శుక్రవారం ఉదయం 5.58 నిమిషాలకు పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. గొందిమళ్లలో పీఠాధిపతులు, సీఎం కేసీఆర్‌ పుష్కరస్నానాలతో సంరంభం ప్రారంభం కానుంది. సిఎం కెసిఆర్‌ దంపతులు స్నానమాచరించి జోగులాంబ ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. ఇదిలావుంటే కృష్ణా పుష్కరాల ఏర్పాట్లపై సీఎం కేసీఆర్‌ అధికారిక నివాసంలో సవిూక్ష నిర్వహించారు. వరుస సెలవుల కారణంగా భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశమున్నందున..వారికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేసినట్లు మంత్రులు సీఎం కేసీఆర్‌కు తెలిపారు. భారీ వర్షాల ధాటికి ప్రాజెక్టులు నిండుతున్న నేపథ్యంలో నీటి విడుదలలో జాప్యం చేయొద్దని సీఎం కేసీఆర్‌ మంత్రులు, అధికారులకు నిర్దేశించారు. మొదటి స్నాన ఘట్టం నుంచి ఆఖరి స్నానఘట్టం వరకు పుష్కలమైన నీరు ప్రవహిస్తుండటం పట్ల సీఎం కేసీఆర్‌ సంతోషం వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్‌, నల్లగొండ జిల్లాల్లో 81 పుష్కరఘాట్ల నిర్మాణ పనులపై సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు.

నదీతీరం వెంట ఆలయాలకు శోభ

పుష్కరాలకు వేళయ్యింది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో పుష్కర వేడుకలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు శరవేగంగా పూర్తి చేస్తున్నారు. కృష్ణాతీరం వెంబడి ఉన్న కర్నూలు, పాలమూరు, నల్లగొండ, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పుష్కర స్నానాలకు లక్షలాదిగా భక్తులు తరలివచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల 12న శుక్రవారం కృష్ణా నదిలో పుష్కరుడు ప్రవేశిస్తాడు. ఇరు తెలుగు రాష్ట్రాల్లో పుష్కరాలను ఘనంగా నిర్వహించడంతో పాటు ప్రముఖులను రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రముఖులకు ఇప్పటికే ఆహ్వానాలు అందించారు. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు, పీఠాధిపతులు తదితర విఐపిలకు స్వయంగా ఆహ్వానం అందించారు. ఎగువన కురిసిన వర్షాలతో కృష్ణమ్మ నీటితో కనిపిస్తోంది. పరిస్థితి ఆశాజనకంగా ఉంది. తిరుమల నమూనా ఆలయం విజయవాడలో సిద్దం అయ్యింది. ఆయా ఆలయాల్లో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లుచేశారు.

ఇక తెలంగాణకు సంబంధించి పుష్కర స్నానమాచరించే ప్రజలకు నీటి కొరత లేకుండా చూడాలని నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. నల్గొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో కృష్ణా పరివాహక ప్రాంతాల్లో పుష్కర ఘాట్‌ల దగ్గర నీటి ప్రవాహంపై మంత్రి హరీశ్‌రావు ఉన్నతాధికారులతో సవిూక్షించారు.  పుష్కర స్నానం కోసం శ్రీశైలం నుంచి ప్రతి రోజు 22వేల క్యూసె క్కుల నీటిని దిగువకు విడుదల చేయాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. నల్గొండ జిల్లాలో 29 ఘాట్లు, మహబూబ్‌నగర్‌ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో 52 పుష్కర ఘాట్లను ఏర్పాటు చేశారు.  ఈ రెండు జిలాల్లో మూడున్నర కోట్ల భక్తులు పుష్కర స్నానానికి వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. నల్గొండ జిల్లాలో కోటి, మహబూబ్‌నగర్‌లో 2.50కోట్ల మంది ప్రజలు కృష్ణా పుష్కర స్నానాలు ఆచరించేందుకు రావచ్చని అంచనా వేస్తున్నట్లు నల్గొండ, మహబూబ్‌నగర్‌జిల్లా కలెక్టర్లు సత్యనారాయణరెడ్డి, శ్రీదేవి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ గొందిమల్ల ఘాట్‌లో పుష్కర స్నానమాచరించనున్నారు. ఈ ఘాట్‌ వద్ద  ఏర్పాట్లను కలెక్టర్‌ స్వయంగా పర్యవేక్షించారు. సీఎం కెసిఆర్‌  గురువారం రాత్రికే ఆలంపూర్‌ చేరుకుని, 12న శుక్రవారం  ఉదయం పుష్కరాలను ప్రారంభిస్తారు. పుష్కర ఘాట్‌ల దగ్గర తొక్కిసలాట జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.   రద్దీ తక్కువగా ఉన్న ఘాట్‌లకు ప్రజలను ఎప్పటికప్పుడు మళ్లించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ట్రాఫిక్‌జాంలు జరగకుండా చర్యలు తీసుకోనున్నారు. ఈ మేరకు ప్రత్యామ్నాయదారులు ఏర్పాటు చేస్తున్నారు. ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌పై ప్రత్యేక శ్రద్ద చూపాలని మంత్రి హరీష్‌ రావు కోరారు. ఇక ఎపిలో ప్రముఖంగా విజయవాడలో కృష్ణా పుష్కర సంరంభం కనిపిస్తోంది. విద్యుద్దీప కాంతులు.. భారీ ఎత్తున స్వాగత తోరణాలు, దేదీప్యమానంగా వెలిగిపోతున్న ఇంద్రకీలాద్రి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. పవిత్రసంగమం వద్ద హారతి కోసం సిద్ధం చేశారు. సంప్రదాయ నృత్యాలకు ఆప్రాన్‌ వేదికను సిద్దం చేశారు. నవ్యాంధ్ర రాష్ట్రంలో తొలిసారిగా వస్తున్న సంబరం ఇది. విజయవాడ, గుంటూరు జిల్లాల కృష్ణానది తీర ప్రాంతం పుష్కర శోభను సంతరించుకున్నాయి. విజయవాడ నగరంలో ఎక్కడ చూసినా పుష్కర కళ తొణికిసలాడుతోంది. ప్రధాన రోడ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు సంస్థలు, వర్తక వాణిజ్య దుకాణాలు పుష్కర కాంతులు వెదజల్లుతున్నాయి. అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండేలా ఘాట్లను శుభ్రం చేయనున్నారు. ఘాట్లపై పేరుకుపోయిన సిమెంటు, మట్టిని తొలగిస్తున్నారు.  భక్తులు ప్రమాదవశాత్తూ నీళ్లలో మునిగిపోతే తాము ఏ విధంగా అప్రమత్తంగా ఉంటామో రిహార్సల్స్‌ ద్వారా చూపిస్తారు. ఇప్పటికే తొమ్మిది అధునాతన బోట్లను సిద్ధం చేశారు.  ఇప్పటికే పుష్కరవిధుల్లో పాల్గొనబోయే సిబ్బందికి శిక్షణ అందించారు.  పుష్కర ఘాట్ల వద్దకు కృష్ణమ్మ వచ్చేసింది. ప్రకాశం బ్యారేజీ ఎగువున ఉన్న అన్ని ఘాట్ల వద్దకు ఇప్పటికే నీరు చేరగా దిగువున ఉన్న సీతానగరం ఘాట్‌లోకి ఒక ప్రణాళిక ప్రకారం జలాలను ప్రవహింప చేసేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. సాగర్‌, పులిచింతల డ్యాంల నుంచి విడుదలైన నీరు ప్రకాశం బ్యారేజీ దిశగా పరుగులు పెడుతోంది. బ్యారేజీ వద్ద ఇప్పటికే నీటిమట్టం 10 అడుగులు దాటింది. గురువారం ఉదయానికి సీతానగరం ఘాట్‌లోకి నీరు తప్పక చేరుతుందని జలవ నరుల శాఖ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుంటే తాడేపల్లి, మంగళగిరి, దుగ్గిరాల, కొల్లిపర, కొల్లూరు, భట్టిప్రోలు, తెనాలి, రేపల్లె మండలాల్లోని పుష్కరఘాట్లలోకి కూడా బ్యారేజీ నుంచే నీటిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం శ్రీశైలం నుంచి విడుదలౌతున్న నీరు నాగార్జునసాగర్‌ ద్వారా దిగువకు విడుదల చేస్తామని పేర్కొన్నాయి. ఇతర జిల్లాల నుంచి వచ్చే యాత్రికులు తమ వాహనాలను ఎక్కడ పార్కింగ్‌ చేసుకోవాలి, అక్కడి నుంచి పుష్కరఘాట్లకు ఎలా చేరుకోవచ్చు అనే వివరాలతో హైవేలపై ఫ్లెక్సీ బ్యానర్లు ఏర్పాటు చేశారు.  పుష్కర స్పెషల్‌ బస్సుల ద్వారా ఘాట్ల వద్దకు తీసుకెళ్లి మళ్లీ తిరిగి తీసుకొచ్చి పార్కింగ్‌ ప్రదేశంలో దింపేందుకు ఏర్పాట్లు చేస్తోన్నారు.  వీవీఐపీల వాహనాల రాకపోకలకు ప్రత్యేక మార్గం ఏర్పాటు చేశారు. అమరావతి వైపు వెళ్లే యాత్రికులకు గుంటూరు నగర శివార్లలోని ¬సన్నా మందిరం వద్ద పుష్కరనగర్‌ ఏర్పాటు చేశారు. పుష్కరాల కోసం 36 వేల మంది సిబ్బందికి డ్యూటీలు వేశారు. 24 గంటలు సిబ్బంది పని చేసేలా మూడు షిఫ్టులను ఏర్పాటు చేశారు. పుష్కర విధులకు వచ్చే అధికారులకు, సిబ్బందికి ఘాట్ల సవిూపంలోనే వసతి, భోజన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు  తెలిపారు.

నరసింహన్‌కు పుష్కర ఆహ్వానం

గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌తో  తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఎ.ఇంద్రకరణ్రెడ్డి భేటీ అయ్యారు. బుధవారం గవర్నర్‌ క్యాంపు  కార్యాలయంలో నరసింహన్‌తో ఇంద్రకరణ్‌ సమావేశమయ్యారు. శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న కృష్ణ పుష్కరాలకు రావాలని ఆయనను ఇంద్రకరణ్‌ ఆహ్వానించారు. అందుకు సంబంధించిన ఆహ్వాన పత్రికను నరసింహన్‌కు ఆయన అందజేశారు. 12నుంచి ప్రారంభం కానున్న పుష్కరాల ఏర్పాట్లను ఆయన వివరించారు. ప్రజల రాకను దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేశామని అన్నారు.