పుస్తకాల ముద్రణ పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వ జాప్యం
ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పుల్లని వేణు
చేర్యాల (జనంసాక్షి) జూన్ 22 : రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలకు పుస్తకాల ముద్రణ యూనిఫామ్ లు పంపిణీలో జాప్యం చేసిందని ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పుల్లని వేణు అన్నారు. బుధవారం చేర్యాల మండల కేంద్రంలోని సీపీఐ భవన్ లో ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని ఇంతవరకు పాఠశాలలకు పుస్తకాలు యూనిఫామ్ లు పంపిణి చేయకపోవడం వల్ల పాత పాఠ్యంశాలనే రివిజన్ చేపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు జిల్లాలకు 40లక్షల పుస్తకాలు మాత్రమే పంపిణి చేశారని, సుమారు 26 లక్షల మంది విద్యార్థులకు2 కోట్ల 30 లక్షల పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేసియాల్సివున్నా జాప్యం చేస్తున్నారని విద్యార్థులు నెల రోజులుగా పుస్తకాల కోసం ఎదురుచూస్తున్నారని ఆయన అన్నారు. ఇంగ్లీష్ మీడియంలో భోధన చేస్తామని గొప్పలు చెప్పి పుస్తకాలు మాత్రం ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించారు. విద్యార్థులను ఇబ్బంది పెట్టకుండా త్వరగా పంపిణి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు పాల్గొన్నారు.