పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిపి తీరుతాం:సుధీంద్ర

xg3t4is0ముంబై,: పాకిస్తాన్‌ మాజీ విదేశాంగ మంత్రి ఖుర్షిద్‌ మహ్మద్‌ కసూరి రాసిన పుస్తకావిష్కరణ కార్యక్రమం సోమవారం సాయంత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ జరిపితీరుతామని, ఆగే ప్రసక్తే లేదని సుధీంద్ర కులకర్ణి, ఖుర్షిద్‌ మహ్మద్‌ స్పష్టం చేశారు. ఈ ఘటనపై సుధీంద్ర ిఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ సందర్భంగా సుధీంద్ర మీడయాతో మాట్లాడుతూ మా కార్యక్రమ వేదిక అయిన నెహ్రూ సెంటర్‌ నిర్వాహకులను శివసేన కార్యకర్తలు బెదించారని పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని రద్దు చేసుకోకపోతే అడ్డుపడతామని వారు హెచ్చరించారని అన్నారు. తమదైన శైలిలో అవాంతరాలు సృష్టిస్తామని శివసేన హెచ్చరించిందని ఆయన తెలిపారు. అయినప్పటికీ మా కార్యక్రమం ఆగబోదని సుధీంద్ర స్పష్టం చేశారు. పాక్‌ మాజీ మంత్రి ఖుర్షిద్‌ మహ్మద్‌ కసూరి రాసిన పుస్తకావిష్కరణ కార్యక్రమం ఈ సాయంత్రం ముంబైలో జరగనుంది. ఆ కార్యక్రమం నిర్వహించవద్దని డిమాండ్‌ చేస్తూ శివసేన కార్యకర్తలు సుధీంద్ర కులకర్ణిపై దాడి చేసి ముఖంపై నల్ల సిరా పూసిన విషయం తెలిసిందే.