పూరింటికి నిప్పు.. చిన్నారి మృతి

సోమల: చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం సోమల సమీపంలోని భారతమ్మ మిట్టవడ్డిపల్లిలో నిన్న రాత్రి గుర్తి తెలియని వ్యక్తులు మనోహర్‌ అనే కూలీకి చెందిన పూరింటికి నిప్పుపెట్టారు. ఈ ఘటనలో పూరింటిలో నిద్రిస్తున్న ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అనూష (4) అనే చిన్నారి  కాలిన గాయాలతో తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.