పూర్తి స్తాయి ఉద్యోగ నోటిఫికెషన్ ను తక్షణమే ఇవ్వాలి.


కరీంనగర్ టౌన్ నవంబర్ 18(జనం సాక్షి)

పూర్తి స్తాయి ఉద్యోగ నోటిఫికెషన్ ను తక్షణమే ఇవ్వాలి అని ఎఐఎస్ బి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గవ్వ వంశీధర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా కరీంనగర్ జిల్లా కేంద్రం లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్తాయి ఉద్యోగ నొటిఫికేషన్ ఇవ్వకుండా నిరుద్యోగుల జీవితాలతో చలగాటం ఆడుతుందని తక్షణమే జాబ్ క్యాలండర్ రీలీజ్ చేయాలని డిమాండ్ చేశారు.ఉప ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఉద్యోగ నోటిఫికేషన్ ల పై ఒక పెపర్ ప్రకటన చేసి ఎన్నికలలో లభ్ది పొందే ప్రయత్నం చేస్తున్నారని ఇది మంచి పద్దతి కాదని హిత్ పలికారు.ప్రభుత్వ విధ్యా సంస్థలలో కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం గోర వైఫల్యం చేందిందని దీని వలన విధ్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తక్షణమే వసతుకల్పించాలని డిమాండ్ చేశారు.ప్రత్యేక నిధులు కేటాయించి ప్రభుత్వ పాఠశాలలను, కళాశాలలను అభివృద్ది చేయాలని డిమాండ్ చేశారు.గత రెండు సంవత్సరాలుగ పెండింగ్ లో ఉన్న9వ,10వ తరగతి బీసి విధ్యార్తుల ఫ్రీ మేట్రిక్ స్కాలర్ షిఫ్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని లేని పక్షంలో ఏఐఎస్ బి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎఐఎస్ బి రాష్ట్ర కార్యదర్శి మొలుగూరి హరికృష్ణ, రాష్ట కమిటి సభ్యులు ముత్యాల హరీష్ రెడ్డి, ఎఐఎస్ బి జిల్లా నాయకులు కళికోట అభిలాష్, టీయుసిసి జిల్లా కన్వీనర్ కురువెళ్లి శంకర్ జిల్లా నాయకులు కార్తీక్ రెడ్డి, రాజేష్, నీరజ్ తదితరులు పాల్గోన్నారు.