పెంచిన ఇంజనీరింగ్ ఫీజులను తక్షణమే తగ్గించాలి

సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): రాష్ట్రంలో పెంచిన ఇంజనీరింగ్ ఫీజులను తక్షణమే తగ్గించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు గోపగాని రవికుమార్ డిమాండ్ చేశారు.సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఆ సంఘ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.రాష్ట్రంలోని అన్ని ఇంజినీరింగ్ కళాశాలలకు ఒకే రకమైన ఫీజుని ప్రభుత్వం , ఉన్నత విద్యామండలి నిర్ణయించాలని  అన్నారు.ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలకు ఫీజులపై ఉన్న శ్రద్ధ మౌలిక వసతుల కల్పనలో లేదన్నారు. తెలంగాణ అడ్మిషన్స్ , ఫీ రెగ్యులేటరి కమిటీ ఏలాంటి ఫీజులు పెంచలేదని నివేదిక ఇచ్చినప్పటికీ యాజమాన్యాలు కోర్టుకి వెళ్లి మరి ఫీజులు పెంచేలా తీర్పు తెచ్చుకోవడం  దురదృష్టకరమని అన్నారు.కళాశాలలు  ప్రారంభానికి ముందే తనిఖీలు నిర్వహించి, క్లాస్ రూమ్, ల్యాబ్స్, టీచింగ్ స్టాఫ్ తో పాటు మౌలిక వసతులు ఎలా ఉన్నాయో అనేది పర్యవేక్షించకుండానే లక్షల సీట్లకు అనుమతి ఇవ్వడం సమంజసం కాదని పేర్కొన్నారు. కొన్నిచోట్ల తనిఖీలు చేసిన అవి నామమాత్రంగానే ఉన్నాయని అన్నారు. పెంచిన ఫీజులు తగ్గించాలని, పూర్తిస్థాయిలో మౌలిక వసతులు లేని ఇంజనీరింగ్ కళాశాలలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో నాయకులు వీరబోయిన మహేష్ , జటంగి వేణు ,నికిత , ఇందు , అశ్విని , సౌమ్య , రమ్య, ఉదయశ్రీ , సిరి తదితరులు పాల్గొన్నారు