పెండింగ్ క్లయిమ్ లను వెంటనే పరిష్కరించాలి
సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): లేబర్ ఆఫీసులలో పెండింగ్ లో ఉన్న క్లెయిమ్ లను వెంటనే పరిష్కరించాలని ఐఎఫ్టీయు జిల్లా ప్రధాన కార్యదర్శి గంటా నాగయ్య , తెలంగాణ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దేశోజు మధు అన్నారు.శుక్రవారం ఐఎఫ్టీయు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జాతీయ కోఆర్డినేషన్ కమిటీ పిలుపు మేరకు సూర్యాపేట లేబర్ కమిషనర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవన నిర్మాణ రంగ కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు.వీటిని ప్రభుత్వాలు పరిశీలన చేసి పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయని విమర్శించారు.కార్మికులు చెల్లించిన సభ్యత్వ రుసుం, సెస్ ద్వారా వచ్చిన నిధులను కార్మికులకే ఉపయోగించాలన్నారు.ఇతర సంక్షేమ పథకాలకు మళ్లించిన నిధులను తిరిగి బోర్డులో ప్రభుత్వాలు జమ చేయాలని,ఇతర పథకాలకు ఖర్చు చేయకూడదన్నారు.సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం నిర్దిష్టంగా అమలు చేయాలని కోరారు.రాష్ట్రంలో సీఎం కెసిఆర్ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు బైకులు ఇస్తామన్న హామీ అమలు కాలేదన్నారు.ప్రమాదవశాత్తు చనిపోయిన కార్మికుడికి ఇచ్చేటువంటి భీమాను పది లక్షల రూపాయలకు,సాధారణ మరణానికి 5 లక్షలకు పెంచాలన్నారు.ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం కల్పించాలని కోరారు.50 ఏళ్లు నిండిన ప్రతి కార్మికుడికి నెలకు పెన్షన్ రూ.6వేలు ఇవ్వాలన్నారు.నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు బొల్లే వెంకన్న , ఒగ్గు వెంకన్న , నిమ్మల హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.