పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తున్న పాలకవర్గాలు. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి సాధుల శ్రీనివాస్.

తొర్రూరు.11 జూన్ (జనం సాక్షి )
రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తున్నారని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి సాధుల శ్రీనివాస్ అన్నారు. శనివారం తొర్రూర్ మండల కేంద్రంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ హాల్ లో పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగింది. ఈ శిక్షణ తరగతులలో ఉదయం పూట క్లాసు పార్టీ నిర్మాణం, విశిష్టత అనే క్లాస్ ను పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అల్వాల వీరయ్య బోధించారు. మధ్యాహ్నం క్లాసు పార్టీ జిల్లా కార్యదర్శి సాధుల శ్రీనివాస్ బోధిస్తూ అఖిలభారత మహాసభల కర్తవ్యాలను చెప్పడం జరిగింది. అనంతరం సాధుల శ్రీనివాస్, అల్వాల వీరయ్య హాజరై వారు మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలను గాలికి వదిలి, పెట్టుబడిదారులకు, కార్పొరేట్లకు దోచిపెట్టే విధానాలను అవలంబిస్తున్నారని వారు ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. గ్యాస్ పెట్రోల్ నిత్యావసర వస్తువుల ధరలను పెంచి సామాన్యుడి నడ్డి విడిచే ప్రయత్నం చేస్తున్నారు తప్ప, ధరలను నియంత్రించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని వారు అన్నారు. మొత్తం ప్రభుత్వ ఆస్తులు అమ్మి ఖజానా నింపడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఓకే విధానాలు తీసుకున్నాయని వారు ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వాలు ఇలానే వ్యవహరిస్తే పేదవాళ్లు మరింత పేదవాడుగా అవుతారని కార్పొరేట్ శక్తులు విచ్చలవిడిగా పెరుగుతాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ దేశంలో సమస్యలు పరిష్కారం కావాలంటే సోషలిజమే ప్రత్యామ్నాయ మార్గం అని, భూస్వామ్య పెట్టుబడిదారీ విధానాలు మారనంత కాలం పేదల బతుకులు మారవు అని దానికి ఏకైక మార్గం విప్లవమే అని వారు ఈ సందర్భంగా అన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడిదారులను వదిలి ప్రజల సంక్షేమం కోసం పాటుపడాలని లేనియెడల, కార్మికవర్గం రైతులు, పేద మధ్య తరగతి ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలకు సిద్ధం కావాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బొల్లం అశోక్, ఎండి యాకుబ్, సోమిరెడ్డి, దర్గయ్య, సాయి మల్లు, మార్క సాంబయ్య, జమ్మల శ్రీను, బొరా స్వామి, గజ్జి రామ్మూర్తి, తాళ్ల వెంకటేశ్వర్లు, జితేందర్ రెడ్డి, విజయ, అబ్దుల్ బీ, మనెమ్మ, యాకాంత, యాకయ్య, కుమార్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.