పెట్టుబడిదారుల లాభాల కోసమే కార్మిక చట్టాల రద్దు.
సిఐటియు అఖిలభారత ఉపాధ్యక్షులు సాయిబాబు
జహీరాబాద్ సెప్టెంబర్ 23 (జనం సాక్షి) కేంద్ర ప్రభుత్వం కోట్లాది మంది కార్మికులను కాదని, కార్మికుల ప్రయోజనాలు కాదని, కేవలం కొంతమంది పెట్టుబడిదారులు లాభాల కోసం కోట్లాది మంది కార్మికుల ప్రయోజనాలను తాకట్టు పెట్టేందుకు సిద్ధపడింది, పెట్టుబడిదారులకు ఊడిగం చేయడం కోసం వాళ్ళ లాభాలు రెట్టింపు చేయడం కోసమే కార్మిక చట్టాలను రద్దు చేసిందని దీనిని తక్షణమే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ అఖిల భారత ఉపాధ్యక్షులు .సాయిబాబు డిమాండ్ చేశారు.శుక్రవారం మహీంద్రా అండ్ మహీంద్రా పరిశ్రమలో జరిగిన సమావేశంలో సాయిబాబు మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం పెట్టుబడిదారుల పక్షాన నిలబడుతూ కోట్లాది మంది పేద కార్మికులను పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు.. ఈ కార్యక్రమంలో సీఐటీయూ ఆల్ ఇండియా కమిటీ సభ్యులు సుదీప్, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జై.మల్లికార్జున్, జిల్లా అధ్యక్షుడు మల్లేశం, జహీరాబాద్ పారిశ్రామిక క్లస్టర్ కమిటీ కన్వీనర్ ఎస్.మహిపాల్ మహీంద్రా అండ్ మహీంద్రా యూనియన్ జనరల్ సెక్రెటరీ రాజిరెడ్డి, నాయకులు కనక రెడ్డి, వీరయ్య గౌడ్, నరేష్, శ్రీకాంత్,కిరణ్ తదితరులు ఉన్నారు.