పెట్టుబడులకు హైదరాబాద్‌ అత్యుత్తమ నగరం

02

– మంత్రి కేటీఆర్‌

డల్లాస్‌ మే 4 (జనంసాక్షి):

పంచాయితీరాజ్‌ ,ఐటిశాఖ మంత్రి కె.తారక రామారావు  అమెరికాలో తన నాలుగో రోజు పర్యటనలో భాగంగా డల్లాస్‌ లో పర్యటించారు. వైబ్రంట్‌ హైదరాబాద్‌ కార్యక్రమంలో పాల్గోని హైదారాబాద్‌ కేంద్రంగా ఉన్న పెట్టుబడుల అవకాశాలను, నగరానికి ఉన్న ప్రత్యేకతలను వివరించారు. హైదరాబాద్‌ నగరాన్ని అంతర్జాతీయ స్ధాయికి తీసుకెళ్లేందుకు చేపట్టిన కార్యక్రమాలను వివరించారు.    పట్టుబడులకు హైదరాబాదే అత్యుత్తమ నగరంగా ఆయన పేర్కోన్నారు.  ఐటి తోపాటు ఏరోస్పేస్‌ మరియు రక్షణ రంగాలు తమ ప్రాధాన్యత రంగాలని ఆ మేరకి ఇప్పటికే అరంగంలోని ప్రముఖ కంపెనీలో చర్చలు చేపడుతున్నామన్నారు.  ఈ రంగాల్లో ఇప్పటికే హైదరాబాద్‌ ముందు వరసలో ఉందని తెలిపారు. మెత్తంగా హైదరాబాద్‌ అనేది పెట్టుబడులకి స్వర్గధామంగా ఉంటుందని మంత్రి తారక రామారావు తెలిపారు. సాయంత్రం డల్లాస్‌ నుంచి బయలు దేరే ముందు అక్కడి ఏన్నారైలతో విూట్‌ అండ్‌ గ్రీట్‌ కార్యక్రమంలో పాల్గోన్నారు. అక్కడి ఏన్నారైలకి ప్రభుత్వ చేపట్టిన పలు కార్యక్రమాలను వివరించి వారి భాగసామ్యం కోరారు. డల్లాస్‌ లో ఉన్న ఏన్నారైలు రెండు లక్షల అమెరికన్‌ డాలర్లను తెలంగాణ డ్రింకింగ్‌ వాటర్‌ ప్రాజెక్టుకి, మిషన్‌ కాకతీయకి విరాళమిచ్చేందుకు ముందుకు వచ్చారు.

అంతకు ముందు  పిట్స్‌ బర్గ్‌ నుంచి డల్లాస్‌ చేరుకున్న మంత్రికి డల్లాస్‌ విమానాశ్రాయంలో ఘన స్వాగతం లభించింది. టిడిఏప్‌, టిటా, టాటా సంస్ధల ప్రతినిధులు,  వందల మంది ఏన్నారైలు మంత్రికి స్వాగతం పలికారు.

మంత్రి కె.తారకరామారావు డల్లాస్‌ లోని సిమా క్లబ్‌ లో ఏర్పాటు చేసిన పెట్టుబడిదారుల విందు సమావేశానికి హజరయ్యారు. తెలంగాణలో ఉన్న పలు పెట్టుబడి అవకాశాలను వివరించిన మంత్రి  పరిశ్రమల పట్ల, పారిశ్రామిక పెట్టుబడుల పట్ల తెలంగాణ ప్రభుత్వం సహకార దోరణిలో ముందుకు సాగుతుందని తెలిపారు. పెట్టుబడులతో తమ రాష్ట్రానికి వచ్చే వర్గాలకి దేశంలోని ఇతర రాష్ట్రాలకన్నా అత్యుత్తమ సౌకర్యాలను కల్పిస్తామన్నారు.

అతర్వతా డల్లాస్‌ లోని సూమారు 150 ఐటి కంపెనీలు కలిసి ఏర్పాటు చేసిన  ఐటి సర్వ్‌ అలయెన్స్‌ అనే  కార్యక్రమంలో పాల్గోన్నారు. తెలంగాణ ఐటి శాఖ కార్యదర్శి జయేష్‌ రంజన్‌ ూఓఇబ రంగంలో తెలంగాణ ప్రభుత్వం అందించే రాయితీలను, సౌకర్యాల గురించి పవర్‌ పాంయింట్‌ ప్రజేంటేషన్‌ ఇచ్చారు.  ఐటి సర్వ్‌ అలియన్స్‌ కార్యక్రమంలో మాట్లాడిన మంత్రి తమ ప్రభుత్వం ఐటి పరిశ్రమ అభివృద్ది కోసం చేపట్టిన కార్యక్రమాలను రాబోయే సంవత్సరాల్లో ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించారు. తమ ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ది తోపాటు తెలంగాణ సమగ్రంగా అభివృద్ది చేందేందకు  అవసరమై విద్యత్‌ ఉత్సత్తిని నాలుగింతలు చేయనున్నట్లు తెలిపారు.  ఇందుకోసం ఇప్పటికే రాష్ట్రం ప్రభుత్వం కార్యచరణని ప్రారంభించిందన్నారు. తాము చేపట్టబోతున్న టి హబ్‌ ద్వార విద్యార్ధులు, యువకుల రెక్కలు తోడుగుతామని మంత్రి విశ్వాసం వ్యక్తం చేసారు

తమ ప్రభుత్వ పాలసీ తక్కువ ప్రమేయం, అత్యదిక సౌకర్యంగా అనే స్పూర్తితో రూపోందించబడిందని మంత్రి తెలిపారు. అందుకే దేశంలో ఏక్కడాలేని విధంగా విప్లవాత్మమకమై పారిశ్రామిక విధానంతో ముందుకు వచ్చిందని తెలిపారు.