పెట్రో ధరలపై వినూత్న నిరసన

నల్లగొండ,మే24(జ‌నం సాక్షి):పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు నిరసనగా రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులు డా:నలగాటి ప్రసన్న రాజ్‌ ఆధ్వర్యంలో  నకిరేకల్‌లో విన్నూత్న పద్దతిలో నిరసన తెలిపారు.  శవ యాత్ర, తాళ్లతో ట్రాక్టర్‌ను లాగుతూ సాయి బాబా గుడి దగ్గర నుండి వెంకటేశ్వర థియోటర్‌ వరకు ర్యాలీ నిర్వహించారు.  మెయిన్‌ సెంటర్‌లో రాస్తారోకో చేసి మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నూక కిరణ్‌ కుమార్‌ యాదవ్‌,  పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు