*పెత్తందారి వ్యవస్థను తరిమికొట్టిన వీరనారి ఐలమ్మ*

*చాకలి ఐలమ్మ స్ఫూర్తితోనే తెలంగాణ మలిదశ ఉద్యమం*
*ఐలమ్మ ఆదర్శాలతోనే కేసీఆర్ సారథ్యంలో అన్నివర్గాలకు సమప్రాధాన్యం*
*-నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య*
*కక్కిరేణి గ్రామంలో చాకలి ఐలమ్మ 37వ వర్థంతి సందర్భంగా విగ్రహావిష్కరణ*
చాకలి ఐలమ్మ ఆదర్శాలతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో అన్నివర్గాలకు సమ ప్రాధాన్యత లభిస్తుందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. శనివారం చాకలి ఐలమ్మ 37వ వర్థంతి సందర్భంగా రామన్నపేట మండలంలోని కక్కిరేణి గ్రామంలో చాకలి ఐలమ్మ  విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అంతకుముందు రామన్నపేట పట్టణ కేంద్రంలోని సుభాష్ సెంటర్ వద్ద వారి చిత్రపటానికి పూలమాల వేసి వారి త్యాగాలను స్మరించుకున్నారు, అనంతరం కక్కిరేణి గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెత్తందారి వ్యవస్థను తరిమికొట్టిన వీరనారి ఐలమ్మ గారని,చాకలి ఐలమ్మ స్ఫూర్తితోనే తెలంగాణ మలిదశ ఉద్యమం ఉవ్వెత్తున సాగిందన్నారు, నియోజకవర్గ స్థాయిలో ఎక్కడా లేని విధంగా విగ్రహా ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులను అభినందించి, విగ్రహా దాతలను ఆయన ఘనంగా సన్మానించారు, గ్రామాభివృద్ధికి శక్తి మేర కృషి చేస్తానని, కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఎల్లవేళలా తన పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ  కన్నెబోయిన జ్యోతి బలరాం, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు మందడి ఉదయ్ రెడ్డి రజక సంఘం జిల్లా అధ్యక్షుడు బొడ్డుపల్లి లింగయ్య మార్కెట్ వైస్ చైర్మన్ కంభంపాటి శ్రీనివాస్ టిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి పోషబోయిన మల్లేశం రజక సంఘం మండల అధ్యక్షుడు కొండూరు శంకర్ గ్రామ సర్పంచ్ పిట్టె కృష్ణారెడ్డి ఉప సర్పంచ్ ముప్పిడి దయాకర్ నాయకులు నీల దయాకర్ , బద్దుల రమేష్, పున్న వెంకటేశం, గోగు సత్తయ్య, కడమంచి స్వామి, నడిగోటి స్వామి, వేముల సైదులు, గుండు రమేష్, నడిగోటి రమేష్, కన్నెబోయిన వెంకటేశం ,భాషబోయిన భిక్షం, మెట్టు మధు, కిన్నెర మహేష్ నడిగోటి వెంకన్న, గుండాల మల్లేశం, బాసాని సత్యనారాయణ, బాసాని నరసింహ, బొలుగుల కృష్ణ, కళ్లెం స్వామి తదితరులు పాల్గొన్నారు.
2 Attachments • Scanned by Gmail