పెద్దపల్లిలో టిఆర్‌ఎస్‌ ప్రచార ¬రు

ఇంటింటా తిరుగుతూ అభ్యర్థుల ప్రచారం
అభివృద్ది కొనసాగాలంటే మళ్లీ ఓటేయాలని పిలుపు
పెద్దపల్లి,డిసెంబర్‌3(జ‌నంసాక్షి):  పెద్దపల్లి పరిధిలో ఉన్న మూడు నియోజకవర్గాల్లో టిఆర్‌ఎస్‌ జోరుగా ప్రచచారం చేస్తోంది.  మంథనిలో పుట్టా మధు, పెద్దపల్లిలో దాసరి మనోహర్‌రెడ్డి,రామగుండంలో సత్యనారాయణ ఇంటింటి ప్రచారానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. మరోసారి వీరిని ఎమ్మెల్యేలుగా గెలిపించాలని కోరుతూ పార్టీ నేతలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మనోహర్‌రెడ్డి పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యున్నతికి నిరంతరం కృషి చేశారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి కారుగుర్తుకు ఓటు వేయాలని కోరారు. రాష్ట్రం బంగారు తెలంగాణగా నిర్మాణం జరగాలంటే కేసీఆర్‌ మరోసారి ముఖ్యమంత్రిగా కావాలని సూచించారు. పెద్దపల్లి నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని చూసి కారు గుర్తుకు ఓటెయ్యాలని టీఆర్‌ఎస్‌ అసెంబ్లీ అభ్యర్థి దాసరి మనోహర్‌రెడ్డి సతీమణి దాసరి పుష్పలతారెడ్డి కోరారు. ఆమె ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ మహిళలకు బొట్టుపెట్టి ఓట్లు అభ్యర్థించారు. అభ్యర్థులకు  మద్దతుగా పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పెద్దపల్లి వార్డుల్లో ఆయా వార్డు కౌన్సిలర్లు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ టీఆర్‌ఎస్‌ ప్రగతి పత్రాలను అందిస్తూ కారు గుర్తుకు ఓయాలని అభ్యర్థించారు. టీఆర్‌ఎస్‌ పార్టీని గెలిపిస్తేనే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ముందుకు సాగుతాయన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న టీఆర్‌ఎస్‌ పార్టీ గెలుపులో ప్రతి ఒక్కరి  పాత్ర ప్రధాన భూమికగా ఉండాలని పెద్దపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు.  టీఆర్‌ఎస్‌ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇందుకోసం  వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అభివృద్ది ఫలాలు పూర్తిస్థాయిలో అందాలంటే మరోమారు టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావాలన్నారు.