పెద్దపల్లి జిల్లా డైరెక్టర్ క్రాంతి ని సన్మానించిన మంథని మండల మత్స్యశాఖ అధ్యక్షులు

జనంసాక్షి , మంథని : ఇటీవల పెద్దపెల్లి జిల్లా మత్స్యపారిశ్రామిక సహకార సంఘం జిల్లా ఎన్నికల సందర్భంగా పెద్దపల్లి జిల్లా డైరెక్టర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి పోతరవేని క్రాంతి కుమార్ ని మంథని మండలానికి సంబంధించిన మత్స్య సహకార సంఘాల అధ్యక్షులు బుధవారం ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా డైరెక్టర్ పోతరవేని క్రాంతి మాట్లాడుతూ.. మత్స్యశాఖ అభివృద్ధికి తోడ్పడుతూ మత్స్య కార్మికులకు సంబంధించిన ఎటువంటి సమస్యలు ఐనా పరిష్కరించడానికి ముందుంటామని మత్స్యశాఖ బలోపేతం చేయడానికి తగిన విధంగా కృషి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మంథని మండలానికి సంబంధించిన అధ్యక్షులు ఎగ్లాస్ పుర్ జెట్టి శంకర్, మల్లేపల్లి వెంకన్న, మైదుపల్లి రాజన్న, గాజుల పల్లి మహేందర్, లక్కేపుర్ దుర్గా రాజ్, నాగారం శంకర్, గుంజ పడుగు మబ్బు శంకర్, బిట్టుపల్లి నర్సయ్య, అరెంద నాగుల రాజన్న పాల్గొన్నారు.