పెద్దల బకాయిలు రద్దు

రోvijay-mallya-2జువారి ఖర్చులకు బ్యాంకులు, ఏటిఎంల ముందు దేశవ్యాప్తంగా సామాన్యప్రజానీకం రోజుల తరబడి బారులు తీరుతున్న వేళ 63 మంది ఎగవేతదారులకు చెందిన 7016 కోట్ల రూపాయలకు కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. వేలకోట్ల రూపాయలు ఎగవేసి దేశం విడిచి వెళ్లిపోయిన కింగ్‌ఫిషర్‌ అధినేత విజయమాల్యాకు రద్దుల నజరానా అందింది. మాల్యాకు చెందిన 1,200 కోట్ల రూపాయల అప్పు రద్దు అయ్యింది. ఈ జాబితాలో తెలుగురాష్ట్రాలకు చెందిన వారు ఆరుగురు ఉన్నారు. వీరిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు నలుగురు. ఈ మేరకు స్టేట్‌బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ) తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. పార్లమెంటులోనూ ప్రస్తావనకూ వచ్చింది. రద్దును సమర్ధించుకున్న కేంద్ర ఆర్థికశాఖ మంత్రి దీనిని పుస్తకాల్లో సర్ధుబాటుగా పేర్కొన్నారు. ఆ 63 ఖాతాలు కాక మరో 31 ఖాతాల్లో పాక్షిక మొత్తాన్ని, మరో ఆరు ఖాతాలను నిరర్థక ఆస్తులు (ఎన్‌పిఎ)గా ఎస్‌బిఐ ప్రకటిం చింది. ఈ జాబితాను ఒక ఆంగ్లపత్రిక వెబ్‌సైట్‌లో ఉంచడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.