పెద్దోడు తెచ్చిన రోగం ` పేదోడికి శాపం

పేద జీవితాపై కరోనా కాటు
భవిష్యత్‌ భారంగా మారుతుందనే ఆందోళనలో కువృత్తిదాయి
చిగురుటాకుల్లా వణుకుతున్న చిరుద్యోగు, అసంఘటిత కార్మికు
వస కూలీు.. ఉన్నదగ్గర ఉత్తగ కూసుండి తినలేరు, ఇంటికి పోలేరు
అందరికీ ప్రభుత్వ సహాయం అందడం అసాధ్యం
ఉన్నోడు చెప్తుండు ఆరోగ్య సూత్రాు
లేనోడు మింగుతుండు ఆకలి బాధు

 

’’సారూ.. ఈ రోగం ఇంకెన్ని రోజు ఉంటది. కష్టం చేసుకొని బతికెటోళ్ళం, ఇంకెన్ని రోజు కూసుండి తింటం. ప్రభుత్వానికే పైసా రాకడ లేదాయె, ఏ ప్రభుత్వమైనా ఎన్ని రోజు భారం మోత్తది’’
` ఓ దినసరి కూలీ మాట

‘‘ఇదేం రోగం పాడైందే!మా గండాన దాపురించింది. రోజు పొద్దున లేవంగనే పోయి దుకాణం తీస్తే వచ్చే ఐదారు గిరాకీతో నెంతా గడుపుకునెట్లోం. ఎన్నడన్న ఒక్క గంట ఆస్యమై గిరాకి వాపస్‌ పోతేనే పాణమంత పింజంపింజం అయ్యేది. దుకాణం కిరాయి, ఇంటి కిరాయి, కరంటు బ్లిు ఎు్లడెట్లని ఏడుపచ్చేది. ఇప్పుడేమో నెలకు నెలు ఇంట్లనే ఉంటే మాలాంటోళ్లకు ఎు్లడెట్ల? మంగళి షాపుకు పోతే ప్రమాదమెక్కువని ఇప్పుడే ప్రచారం మొదు పెట్టిండ్రు. లాక్‌ డౌన్‌ తీసేసినంక కూడా మా పరిస్థితి ఎట్లనో ఏమో?’’
` ఓ నాయీబ్రాహ్మణుడి గోస

‘‘అన్నా… ఇప్పుడు ప్రాణాతో బయట పడితే చాు, పైసు తర్వాత సంపాదిచ్చుకోవచ్చని అందరు ముచ్చట్లు మంచిగనే చెప్తరు. నెనె జీతం వచ్చినప్పుడే నెలాఖరులో అప్పు చేసే దుస్థితిలో ఉన్నోళ్ళం. నెలకు నెలు ఇంట్లనే ఉంటే మాకు జీతాు ఎవరిస్తరు, ఎక్కడ్నుంచి ఇస్తరు. ఇక మా జీవితమంతా అప్పు చేసుకుంటూనో, అప్పు తీర్చుకుంటూనో బతకడమే అవుతుండొచ్చు’’
` ఓ చిరుద్యోగి వేధన

 

‘‘పుట్టిన ఊర్లో బుక్కెడు దొరకక ఇల్లిడిసి పట్నంకు వచ్చి కూలి పని చేసుకుంటూ బతుకుతున్నం. ఉన్ననాడు తింటున్నం, లేన్నాడు నీళ్ళు తాగి పడుకుంటున్నం. ఇప్పుడు ఇదేం మాయదారి రోగమో కానీ చేద్దామంటే పని లేదు, ఉందామంటే తిండికి లేదు. కలో గంజో తాక్కుంట బతికినాసరే మా వాళ్ళ మద్య సావానుకొని ఊరికి పోదామంటే ఎట్ల పోవుడో తొస్తలేదు’’
` ఓ వస కూలీ రోదన
హైదరబాద్‌,ఏప్రిల్‌ 23(జనంసాక్షి):ఈ అభిప్రాయాు కొందరు కరోనా వైరస్‌ బాధితువి, అయినంత మాత్రాన వారు కరోనా సోకినవారని భ్రమ పడవద్దు. వాళ్ళంతా కష్టాన్ని నమ్ముకున్నవారు, కాళ్ళు చేతులే వనయిగా ఉన్నవారు, శ్రమనే పెట్టుబడిగా పెట్టేవారు. కడుపు నిండితే చాు, పూట గడిస్తే చాు అనుకునే వారు. ఇప్పుడు కరోనా అందరితో పాటు వారినీ కదకుండా చేసింది, వాళ్ళ కాళ్ళు చేతుకు విశ్రాంతి ఇచ్చింది. భవిష్యత్తు అంధకారమేనని భయపెడుతుంది. దీనికంతటికీ కారణం యావత్‌ ప్రపంచాన్ని అష్టదిగ్భందం చేసి మనిషిని కదకుండా మార్చిన కరోనా వైరస్‌. మనిషికి కనపడకుండానే పేద జీవితాను అతలాకుతం చేస్తున్న ఈ మహమ్మారి ఎక్కడో చైనాలో పుట్టి విమానా ద్వారా మనదేశంలో అడుగుపెట్టి మనల్ని ఒక్క అడుగూ వేయనీయడం లేదు. దీని ప్రభావంతో ఉన్నత, ఎగువ మద్యతరగతి వర్గాు ఇబ్బంది పడకపోయినప్పటికీ దిగువ, మధ్యతరగతి వర్గాు మాత్రం తీవ్రం భయాందోళనకు గురవుతున్నారు. ప్రధానంగా కువృత్తునే నమ్ముకొని తరతరాుగా జీవితాను నెట్టుకొస్తున్న చాకలి, మంగలి, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, ఔసు, మేర, మేదరి తదితర సబ్బండ వర్ణా విూద మోయలేని భారాన్ని వేసింది లాక్‌ డౌన్‌. చిరుద్యోగు నెజీతానికి భరోసాను దూరం చేయడమే కాకుండా జీవితమంటేనే భయపడేలా చేసింది కరోనా వైరస్‌. ప్రభుత్వాలైనా, పూట గడిచే స్థితిలో ఉన్నవారైనా ఆరోగ్యసూత్రాు బాగానే చెప్తున్నారు కానీ పేదోడి భవిష్యత్తుకు భరోసా ఇచ్చినప్పుడే లాక్‌ డౌన్‌ మరింత విజయవంతమవుతుంది. కరోనా పారిపోతుంది. పెద్దోడు, పేదోడు కలిసి ఎదుగుతారు.

తాజావార్తలు