పెద్ద ఎత్తున్న ఎన్‌ఐఎ సోదాలు

మావోయిస్ట్‌ అగ్రనేత ఆర్కే భార్య శిరీష ఇంట్లో సోదా
విరసం నేత కళ్యాణ్‌రావు ఇంట్లోనూ తనిఖీలు

ఒంగోలు,జూలై19(జనం సాక్షి)

: ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం, ఆలకూరపాడులో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు చేపట్టారు. మావోయిస్ట్‌ అగ్రనేత ఆర్కే భార్య శిరీష, విరసం నేత కళ్యాణ్‌రావు ఇంట్లో అధికారులు సోదాలు చేసారు. అనారోగ్య కారణాలతో విజయవాడ లో చికిత్స కోసం వెళ్లిన ఆర్కే భార్య
శిరీష ఇంటి తాళాలు పగలగొట్టి సోదాలు చేపట్టారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గ్రామంలో భారీగా మోహరించారు. అలాగే విజయవాడలో కూడా ఎన్‌ఐఏ అధికారులు తనిఖీలు చేసారు. విరసం నేతలపై కొద్దిరోజుల క్రితం విశాఖ జిల్లా పెద్దబాయలు పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. దీంతో చత్తీస్‌గడ్‌కు చెందిన ఎన్‌ఐఏ అధికారుల బృందం విజయవాడకు చేరుకుని సింగ్‌నగర్‌లో విరసం నేత దొడ్డి ప్రభాకర్‌ ఇంట్లో సోదాలు చేస్తున్నారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది. టంగుటూరు మండలంలోని ఆలకూరపాడు గ్రామాన్ని పోలీసులు చుట్టుముట్టారు. విరసం నేత ఆర్‌ కె భార్య శిరీష ఇంట్లో పోలీసులు సోదాలు చేపట్టారు. శిరీష ఇంటికెళ్లే దారులన్నిటినీ దిగ్బంధం చేశారు. తాళం వేసి ఉన్న ఆమె ఇంటిని రెవిన్యూ అధికారుల ఆధ్వర్యంలో పగులగొట్టి ఇంట్లో సోదాలు నిర్వహించారు. టంగుటూరు మండలంలోని ఆలకురపాడు గ్రామంలో మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ భార్య శిరీషతోపాటు కొందరు బంధువులు కూడా నివాసముంటున్నారు. ఎన్‌ఐఏ అధికారులకు అందిన కీలక సమాచారం మేరకు… ఆధారాల కోసం మావోయిస్టు అగ్రనేత ఆర్కే భార్య శిరీష ఇంట్లో పోలీసు బృందం సోదాలు నిర్వహిస్తున్నారు. ఎన్‌ఐఏ బృందంతోపాటు స్థానిక స్పెషల్‌ పార్టీ పోలీసులు కూడా గ్రామంలో భారీగా మోహరించారు. జాతీయ దర్యాప్తు సంస్థ ఆధ్వర్యంలో ఏఎస్‌పి అశోక్‌ బాబు పర్యవేక్షణలో సింగరాయకొండ సిఐ మర్రిలక్ష్మణ్‌, స్థానిక ఎస్‌ఐ ఖాదర్‌భాషాతోపాటు స్పెషల్‌ పార్టీ పోలీసులు శిరీష నివాసగృహం పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. శిరీష ప్రస్తుతం గ్రామంలో లేదు. విజయవాడలో ఉన్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు.