పెన్నా వరదలకు అడ్డుకట్టగా గోడ నిర్మాణం
95కోట్లతో చేపట్టిన పనులకు మంత్రి అంబటి ప్రారంభం
నెల్లూరు,జూలై14(జనం సాక్షి ): జిల్లాలో పెన్నా నదికి ప్రహారి గోడ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. దాదాపు రూ.95 కోట్లతో ఈ ప్రహారి గోడ నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ పనులను బుధవారం ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు భగత్‌సింగ్ కాలనీలో ప్రారంభించారు. ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తయితే భవిష్యత్‌లో పెన్నా నదికి సవిూపంలోని వెంకటేశ్వరపురం, భగత్‌సింగ్ కాలనీ, తదితర ప్రాంతాలకు వరద ముప్పు నుంచి విముక్తి కలుగుతుందని మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టి ఏడాదిలోగా పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. గతేడాది నవంబర్‌లో వరదలు వచ్చినప్పుడు నెల్లూరు నగరంలోని పెన్నా నదికి ఆనుకుని ఉన్న భగత్‌సింగ్ కాలనీ, వెంకటేశ్వరపురం తదితర కాలనీలు ముంపునకు గురైన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఒకసారి రిటైనింగ్‌వాల్ నిర్మాణం పనులు పూర్తయితే ఇలాంటి పరిస్థితులు పునరావృతం కావన్నారు. ఈ కాంక్రీట్ గోడ కట్టిన తర్వాతే తమ పార్టీ నేతలు ఆయా ప్రాంతాల్లో పర్యటించి ఓట్లు అడుగుతారని చెప్పారు. సంగం, నెల్లూరు నగరం వద్ద పెన్నా నదిపై బ్యారేజీ పనులు తుదిదశకు చేరుకున్నాయని, వాటిని త్వరలో సీఎం చేతుల విూదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. నగరం సవిూపంలో పెన్నా నదిపై త్వరలో మరో వంతెన రాబోతున్నదని మాజీ మంత్రి, నగర శాసనసభ్యులు పీ అనిల్‌కుమార్ యాదవ్
చెప్పారు. భగత్ సింగ్ కాలనీ, వెంకటేశ్వరపురం ప్రాంతాల అవసరాలను తీర్చేందుకు రూ.8 కోట్ల అంచనా వ్యయంతో నీటి శుద్ధి ఎª`లాంట్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నదని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కేవీఎన్ చక్రధర్‌బాబు, తెలుగుగంగ ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ హరినారాయణరెడ్డి, ఆర్డీఓ పీ కొండయ్య, డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.