పెన్షన్‌ పెంచేందుకు పోరాటం; మంద కృష్ణ

హైదరాబాద్‌; వితంతువులకు , వృద్ధులకు పెన్షన్‌ పెంచేందుకు పోరాటం కొనసాగిస్తామని ఎంఆర్‌పీఎస్‌ రాష్ట్ర అధ్యక్ష్యుడు మంద కృష్ణ మాదిగ హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా పెద్దెముల్‌ గ్రామ పంచాయితిలో వితంతువులు , వృద్ధుల పెంన్షన్ల సాధన కోసం జరిగిన సభకు ఆయన హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వితందువులు , వృద్ధుల పెన్షన్‌ 500 రూపాయల నుంచి 1000 రూపాయలకు పెంచాలని డిమాండ్‌ చేశారు.