పెరూ అధ్యక్షుడిగా సగస్తి ప్రమాణస్వీకారం
లిమా,నవంబర్18(జనంసాక్షి): పెరూ తాత్కాలిక అధ్యక్షుడిగా ఫ్రాన్సిస్కో సగస్తీ ప్రమాణ స్వీకారం చేశారు. మాజీ అధ్యక్షుడు మార్టిన్ విజ్‌కర్రాపై అవినీతి ఆరోపణలు రావడంతో ఆ దేశ కాంగ్రెస్ పార్టీ ఆయనను పదవి నుంచి తొలగించింది. అతని స్థానంలో మాన్యువెల్ మెరినోను నియమించింది. అయినా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసలు వెల్లువెత్తాయి. ఈ నిరసనల్లో ఇద్దరు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 100 మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో మాన్యువెల్ మెరినో కేవలం ఐదు రోజుల్లోనే తన పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో ఫ్రాన్సిస్కో సగస్తీ పెరూ తాత్కాళిక అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మంగళవారం అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన ఆయన.. దేశ ప్రతినిధిగా ప్రజలకు కలిగిన ఇబ్బందికి క్షమాపణ కోరుకుంటున్నానన్నారు. పెరూవియన్ రాజకీయ నేత సగస్తీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పలువురు స్థానిక నాయకులు హాజరయ్యారు.