పెళ్లికి నిరాకరించిందని యువతిపై కత్తితో దాడి
హైదరాబాద్: బోయిన్‌పల్లి ఇక్రిశాట్ కాలనీలో పెళ్లికి నిరాకరించిందని ఓ యువకుడు యువతిపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన యువతి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన యువతిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు రంగప్రవేశం చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కత్తితో దాడి చేసిన యువకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.