పెళ్లిపీటలు ఎక్కుతుండగా హత్య

anil

కరీంనగర్ లో పెళ్లి చేసుకోవడానికి గుడికి వచ్చిన ప్రేమికులపై యువతి కుటుంబ సభ్యులు, బంధువులు దాడి చేశారు. ఈ దాడిలో యువకుడు మృతిచెందాడు. అతని తండ్రి గాయపడ్డాడు. జిల్లాలోని తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలో ఈ దారుణం జరిగింది. మృతుడు కరీంనగర్ లోని విజయపురి వాసి మహంకాళి అనిల్ గా గుర్తించారు. ఈ జంట శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వివాహం చేసుకునేందుకు రావడంతో యువతి కుటుంబ సభ్యులు వచ్చి అతన్ని పొడిచి చంపారు.

దాదాపు 10 మంది యువతి కుటుంబ సభ్యులు, బంధువులు దాడి చేసినట్టు గుర్తించామని కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి చెప్పారు. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను పంపించినట్టు చెప్పారు. అనిల్, మౌనిక మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నట్టు సమాచారం ఉందని, ఇవాళ పెళ్లి చేసుకోవడానికి గుడికి రావడంతో యువతి కుటుంబ సభ్యులు దాడి చేశారని వివరించారు.