పెషావర్ బాధిత బాలలకు ప్రతిష్టాత్మక అవార్డు

పెషావర్: నగరంలోని ఆర్మీ స్కూల్ లో తాలిబన్ల దాడిలో మరణించిన బాలలకు ప్రతిష్టాత్మక అవార్డు ఇవ్వాలని అక్కడి ప్రభుత్వం యోచిస్తోంది.  గతేడాది డిసెంబర్ 16వ తేదీన  పెషావర్ లోని ఆర్మీ స్కూల్ లో ఉగ్రవాదులు మారణకాండ సృష్టించి 145 మందిని బలితీసుకున్న సంగతి తెలిసిందే.  వీరిలో అధికశాతం మంది బాలలే ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆర్మీ స్కూల్ మరణించిన వారందరికీ తమ్ ఘా-ఇ-షూజాత్ అనే అవార్డు ను ఇవ్వాలని ఆ దేశ అధ్యక్షుడు మమ్ నూన్ హుస్సేన్ తీర్మానించారు.

ఈ ఘటనలో పాకిస్థాన్ పౌరుడు కూడా మరణించడంతో అతనికి కూడా ఆ అవార్డును ప్రకటించాలని నిర్ణయించారు. ఇదిలా ఉండగా గాయపడిన వారికి మరో అవార్డును ఇచ్చేందుకు పాక్ ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది.