పేదలందరికి ఇళ్లు నిర్మించాలి

కరీంనగర్‌,డిసెంబర్‌21(జ‌నంసాక్షి): టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇచ్చిన హావిూల అమలుకు పోరాడుతామని,నేతలను నిలదీస్తామని సిపిఐ  పార్టీ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్‌రెడ్డి అన్నారు. సిఎం కెసిఆర్‌ దత్తత గ్రామాల్లో పేదలకు నిర్మించినట్లుగానే రాష్ట్రంలో పేదలందరికి ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నారు. పార్టీ ప్రారంభం నుంచి ఇప్పటివరకు ప్రజలు, కార్మికుల పక్షాన నిలబడి వారి సంక్షేమం, బాగోగుల గురించి ఉద్యమాలు చేసిందన్నారు. ఈక్రమంలో నిజాం పాలనలో ఎంతోమంది పార్టీ కార్యకర్తలు ఆసువులు బాసారని గుర్తు చేశారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ప్రజాసంక్షేమాల్ని విస్మరించాయని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రజలు,
యువత పార్టీ చేసిన కృషి, ఘనతను గుర్తించి భారత కమ్యూనిస్టు పార్టీని ఆదరించాలని కోరారు.