పేదలకు లయన్స్‌క్లబ్ విస్తృత సేవలు
ఖమ్మం, జూలై 23 : ఖమ్మం జిల్లాలో లయన్స్‌క్లబ్ ద్వారా పేద ప్రజలకు విస్తృతంగా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నామని లయన్స్‌క్లబ్ డిస్టిటిక్ గవర్నర్ కోనేరు నాగేశ్వరరావు లయన్స్‌క్లబ్ డిస్టిటిక్ 324 సి-9ను ప్రపంచంలోనే అత్యున్నత స్థాయిలో నిలపడం జరిగిందన్నారు. లయన్స్‌క్లబ్ డిస్టిటిక్ ప్రపంచంలో మూడవ స్థానం, దేశంలో రెండవ స్థానంలో నిలిచిందన్నారు. రాజకీయాలకంటే పేద ప్రజలకు సేవ చేయడంలోనే ఎంతో ఆనందం దక్కుతుందన్నారు. భవిష్యత్‌లో ఖమ్మం లయన్స్‌క్లబ్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఖమ్మం లయన్స్‌క్లబ్‌ను ప్రపంచంలోనే మొదటి స్థానంలోనే ఉండేందుకు కృషి చేస్తామన్నారు.