పేదవారు పాతాళం లోకి..! ధనికులు మరింత పైపైకి..!
అమెరికాలో పెరుగుతున్న అసమానతలు
అమెరికాలో తొలి నుండి కొనసాగుతున్న పేద-ధనిక వ్యత్యాసం ఇటీవలి మాంద్య పరిస్థితుల నాటి నుండి మరింత పెరుగుతూ వస్తోంది. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు సంపన్నుల కొమ్ము కాస్తుండటమే ఇందుకు ప్రదాన కారణం. 2009 మధ్య నాటి నుండి ఆర్థిక వ్యవస్థ గాడిన పడిందని చెబుతున్న అధికారిక గణాంకాల ప్రకారం దేశంలో సంపన్నులైన ఏడు శాతం మంది వద్ద దాదాపు 5.6 లక్షల కోట్ల కుటుంబాటల వద్ద వున్న మొత్తం సంపద విలువ 0.6 లక్షల కోట్లు మాత్రమేనని తెలుస్తోంది. ధనికులు మరింత ధనికులుగా మారటానికి ప్రధాన కారణం ఈ వ్యవధిలో స్టాక్‌మార్కెట్‌లో చోటు చేసుకున్న పరిణామాలేనన్నది అనేక మంది భావన . వీరిలో అధికశాతం మంది తమ సంపదను వాటాలు. ఇతర ఆర్థిక హోల్డింగ్స్ రూపంలో మదుపు చేశారని, కొద్దిపాటి సంపద వున్న కుటుంబాల వారు తమ సంపదలో అధికశాతం తమ ఇంటి కోసం వెచ్చెంచారని పాల్ రిసెర్చ బ్యూరో ప్రచురించిన సెన్సస్ బ్యూరో డేటా నివేదిక వెల్లడించింది. మాంద్య పరిస్థితుల్లో స్టాక్ మార్కెట్ విలువలు ఇబ్బడి ముబ్బడిగా పెరగ్గా, కుదేలయిన ప్రోపర్టీ మార్కెట్ ఇంటిపై పెట్టుబడులు పెట్టిన వారికి భారీ నష్టాలపై మిగిల్చిందని ఈ నివేదిక తెలిపింది. అందువల్ల ఆదాయ రికవరీ అన్నది కేవలం ఓ పెద్ద ఎండమావిలా మారిపోయిందని వ్యూరిసెర్చ్ సెంటర్‌కు చెందిన సీనియర్ రిసెర్చ్ అసోసియేట్ రిచర్డ్‌ప్రై అభిప్రాయపడ్డారు. ప్రజల పన్నుల రూపంలో చెల్లించిన సొమ్మును ఉద్దీపనల పేరుతో ప్రభుత్వం బడా బ్యాంకులకు ఉదారంగా దానం చేయటంతో అది ఆయా సంస్థల షేర్‌హోల్డర్లను మరింత ధనికులుగా మారింది. అయితే పన్నులు చెల్లించిన అదే ప్రజల సంక్షేమం కోసం అమలు చేసే సామాజిక సంక్షేమ కార్యక్రమాల ద్వారా దేశం దివాలా తీస్తుందని ధనికులు వాపోతున్నారని పరిశీలకులు ఆవేదన వ్యక్తంం చేస్తున్నారు. మాంద్య పరిస్థితుల అనంతరం ప్రభుత్వం అనుసరించి విధానాల పుణ్యమా అంటూ దేశంలో పేద, ధనిక వర్గాల మద్య సంపద వ్యత్యాసం భారీగా పెరిగిపోయింది. దేశ జనాభాలో ఏడు శాతం మేర వున్న ధనికులు 2011 నాటికి పెరిగిన దేశ సంపదలో 56 నుండి 63 శాతం వాటాను దక్కించుకున్నారు. మాంద్యంలో సైతం తమను ఆదుకున్న ఆర్థిక ఆస్తులను మరింత సమకూర్చుకోవాలని అమెరికన్ సంపన్నుల భావిస్తున్నారు. ప్రభుత్వ సెక్యూరిటీలు మున్సిపల్ కార్పొరేట్ బాండ్లను కొనుగోలు చేసే ఇతర వర్గాల వారికన్నా వీరు 13 రెట్లు అధికంగా వున్నారు. స్టాక్ మ్యూచువల్ ఫండ్ షేర్లను కొనుగోలు చేసే వారి సంఖ్య నాలుగు శాతం మేర పెరిగింది.
దాదాపు మూడింట రెండొంతుల మంది కుటుంబాల వారు 5 లక్షల డాలర్లు మేర పొదుపు ద్వారా సొమ్మును కూడబెట్టుకోగా అంతకు తక్కువ ఆదాయం వున్న దాదాపు 39 శాతం కుటుంబాల వారు కేవలం ఏదో ఒక దానిని మాత్రం సొంతం చేసుకోగలిగారు.
మొత్తమీద 2009-11ల మధ్యకాలంలో అమెరికా సంపద 14 శాతం మేర పెరిగింది. దీనిని తమ ఆర్థిక వ్యవస్థ విజయవంతంగా పడిందంటూ అమెరికా సర్కారు గొప్పగా చెప్పుకుంటోంది.