పేదింటి ఆడబిడ్డలకు వరప్రదాయని కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకం.
కష్ట కాలంలోనూ సంక్షేమానికే ప్రభుత్వం పెద్దపీట.
ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి.
తాండూరు ఫిబ్రవరి 21(జనంసాక్షి) పేదింటి ఆడబిడ్డలకు వరప్రదాయని కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాలు అందిస్తున్న ప్రభుత్వం టిఆర్ఎస్ అని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు.కోట్ పల్లి మండలానికి చెందిన 12మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదిముబారక్ చెక్కులను క్యాంప్ కార్యాలయం లో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి కృషి చేస్తుందని, ఆడపిల్లల తల్లిదండ్రులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు వరంగా మారాయన్నారు, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలతో బాల్య వివాహాలు తగ్గాయన్నారు. తెలంగాణాలో ఏ ఇంట్లో ఆడబిడ్డ పెళ్ళి జరిగిన ప్రభుత్వ సహకారం ఉండాలని, ముఖ్యమంత్రి కెసిఆర్ కల్యాణలక్ష్మి షాదీముబారక్ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మి పథకం, షాదీముబారక్ ద్వారా నిరుపేద కుటుంబీకులు ఎంతో లబ్ది పొందుతున్నారు. ఆడబిడ్డల పెండ్లికి సీఎం కేసీఆర్ పెద్దన్నగా నిలిచి రూ. 1,00,116/ అందజేస్తున్నారన్నారు. నిరు పేద ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కెసిఆర్ మేనమామ లాగా ఆడ పిల్లల పెళ్లి కి డబ్బులు అందించడం ఎంతో సంతోషించదగిన విషయం అన్నారు, ఈ కార్యక్రమంలో కోటపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్పరి మహేందర్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రాములు, ఇందోల్ సర్పంచ్ రామ్ చందర్, సీనియర్ నాయకులు లక్కాకుల మల్లేశం, ఒగ్లాపురం రాజు, అన్న సాగర్ కృష్ణ, కోటపల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు శ్రీనివాస్ గుప్తా, లింగంపల్లి అనంత్ రెడ్డి, ఉపాధ్యక్షులు మోసిన్, చందు, అనిల్ తదితరులు పాల్గొన్నారు.