పేద కుటుంబాలకు ఆసరా పెన్షన్ భరోసా కల్పిస్తున్న ఏకైక ప్రభుత్వం టిఆర్ఎస్
కెసిఆర్ వల్లనే బంగారు తెలంగాణ సాధ్యం
…….మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
పెద్దవంగర,సెప్టెంబర్01(జనం సాక్షి ) తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే మన ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమల్లోకి వచ్చాయి కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు రైతు బీమా, దళిత బంధు, గొర్రె కురుమలకు గొర్రెలు పంపిణీ కుల మత భేదం లేకుండా అన్ని వర్గాల వారికి అందుతున్నాయని అన్నారు
రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల ప్రజానీకానికి ఆసరా పథకం ద్వారా కొండంత అండగా సీఎం కేసీఆర్ నిలిచాడని రాష్ట్ర పంచాయతీ రాజ్ మరియు ఆర్డబ్ల్యూఎస్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మండలంలోని గంట్లకుంట గ్రామంలో మరియు వివిధ గ్రామాలలో గురువారం స్థానిక సర్పంచులు,ఎంపీపీ ఈదురు రాజేశ్వరి జెడ్పిటిసి శ్రీరామ్ జ్యోతిర్మయి పాలకుర్తి దేవస్థానం చైర్మన్ రామచంద్ర శర్మ మండల పార్టీ అధ్యక్షుడు ఈదురు ఐలయ్య మండల ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ సంజయ్ కుమార్ ఇతర గ్రామ సర్పంచ్లు నాయకులు పాలకుర్తి యాదగిరిరావు మరియు ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి మంత్రి నూతనంగా మంజూరైన పెన్షన్ కార్డుల ధ్రువపత్రాలను లబ్ధిదారులకు అందజేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పెన్షన్ ఎక్కువ మొత్తంలో తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలోనే ఇవ్వడం జరుగుతుందని అన్నారు. పేదలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ వారి గౌరవాన్ని పెంచిన ఏకైక నాయకుడు కేసీఆర్ మాత్రమేనని అన్నారు.ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల ఎంపీడీవో బి,వేణుగోపాల్ రెడ్డి సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యదర్శులు ,వార్డు సభ్యులు టిఆర్ఎస్ యూత్ నాయకులు ప్రజలు గ్రామపంచాయతీ సిబ్బంది ఆసరా పెన్షన్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు