పేద ప్రజల అభివృద్దే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుంది…

జిల్లాలో కొత్తగా ఆసరా పింఛన్లు 8 వేల 424 మంజూరు….
ఆసరా పింఛన్ కార్డులను పంపిణీ చేసిన రాష్ట్ర గిరిజన,స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్…
ములుగు బ్యూరో,ఆగస్ట్29(జనం సాక్షి):-
పేద ప్రజల సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఆసరా పింఛన్ల కార్డుల జారీ కార్యక్రమంలో 9మండలాలకు చెందిన 8వేల 4 వందదాల్ 24 మంది లబ్ధిదారులకు నూతన ఆసరా పింఛను కార్డులను పంపిణీ  చేశారు.ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 33 వేల 179 పెన్షనర్లు ఉండగా,కొత్తగా 8424 మందికి పెన్షన్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.స్వయం పాలనలో అర్హులైన అందరికీ ఆసరా పింఛన్లు ఇవ్వాలని సీఎం కేసీఆర్ చెప్పారన్నారు.అభివృద్ధి తో పాటు సంక్షేమం రెండు కండ్లల కెసిఆర్ చూస్తున్నారని గతంలో ఇందిరాగాంధీ గరీబ్ హటావో,ఎన్టీఆర్ రెండు రూపాయల కిలో బియ్యం, జనాలకు జనత బట్టలు సంక్షేమ రుచి చూపించారని అలా మంచి మనసుతో రాష్ట్ర ముఖ్యమంత్రి పార్టీలకతీతంగా అన్ని వర్గాల వారికి సకల సౌకర్యాలు కల్పిస్తున్నారని రాష్ట్ర ప్రజల సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నారని ఆమె అన్నారు.జిల్లాలో గతంలో వృద్ధాప్య పింఛన్లు 12016,వితంతువులు 15,553, దివ్యాంగులు 3683, చేనేత కార్మికులకు 184, గీత కార్మికులకు 214,బీడీ కార్మికులకు 89, ఒంటరి మహిళలకు 1440 ప్రభుత్వం అందిస్తుందని జిల్లాకు 7 కోట్ల 7లక్షల 62 వేల 224 రూపాయలు మంజూరు చేసిందని ఆమె తెలిపారు.జిల్లాలో ఇప్పుడు  వృద్ధాప్య పింఛన్లు 5583,వితంతువులు 2056, దివ్యాంగులు 569,చేనేత కార్మికులకు 35,గీత కార్మికులకు31,బీడీ కార్మికులకు4, ఒంటరి మహిళలకు 146,ప్రభుత్వం అందిస్తుందని జిల్లాకు 1 కోటి 75లక్షల 51 వేల 784 రూపాయలు మంజూరు చేసిందని ఆమె తెలిపారు.75 ఏళ్ల స్వాతంత్ర పురస్కరించుకొని వజ్రోత్సవాలను 15 రోజులపాటు జిల్లాలో ఘనంగా నిర్వహించుకున్నామని ఆమె అన్నారు.   రాష్ట్రంలో గ్రామపంచాయతీ ఉన్న ములుగును సిఎం కేసిఆర్ జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేశారని ఆమె గుర్తు చేశారు.
ములుగు కలెక్టరేట్ భవనం నిర్మాణానికి 65 కోట్లు మంజూరు చేసి టెండర్లు అగ్రిమెంటు పూర్తయిందని త్వరలో ముఖ్యమంత్రి  శంకుస్థాపన చేయుటకు జిల్లాకు రానున్నరని ఆమె తెలిపారు.ఏటూర్ నాగారంలో డయాలసిస్ సెంటర్ త్వరలో వైద్యశాఖ మంత్రి తో ప్రారంభిస్తామన్నారు.
రామప్ప వరల్డ్ హెరిటేజ్ 33 కోట్ల 80 లక్షల రూపాయలు మంజూరు చేసి ఆరు కోట్ల రూపాయలతో ఆలయ అభివృద్ధి పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టడం జరుగుతున్నదని అన్నారు. జిల్లాలో వైద్య రంగానికి అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు ఆమె తెలిపారు. పింఛన్ కోసం వేలిముద్రతో అవసరం లేకుండా  పోస్ట్ ఆఫీస్ స్మార్ట్ కార్డు  ద్వారా పింఛన్ పొందవచ్చని  అన్నారు.
జిల్లాలో ధ్వంసమైన రోడ్ల ప్రతిపాదనలు పంపాలని చెరువులు తెగ కుండా కరకట్టు నిర్మాణం కోసం ప్రతిపాదనలు అధికారులు సెప్టెంబర్ వరకు సమర్పించాలని కోరారు.జిల్లాలోని ఎస్టీ మహిళా డిగ్రీ కళాశాల ఓగ్లాపూర్ నుండి పీఎంఆర్సి భవనం ఏటూరు నాగారనికి మారుస్తున్నట్లు  ఆమె అన్నారు.జిల్లా ఆస్పత్రి ఏర్పాటు కోసం శంకుస్థాపన చేశామని సిటీస్కాన్ 1250 సిటీ స్కామ్ చేసేమని గిరిజన భవన్ లో క్లైన్ కోట్ ఓపెన్ చేస్తామని, ములుగు జిల్లాను అనిరంగంలో అభివృద్ధి పరుస్తామని ఆమె తెలిపారు.
జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ మాట్లాడుతూ జిల్లాలో నూతన ఆసరా పెన్షన్లు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు నిండు  మనసుతో ముఖ్యమంత్రిని ఆశీర్వదించాలని ఆయన కోరారు.జిల్లా కలెక్టర్ ఎస్. క్రిష్ణ ఆదిత్య మాట్లాడుతూ జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి పింఛన్లు కొరకు ఎక్కువ దరఖాస్తులు వచ్చేవని ఇప్పుడు కొత్త పింఛన్లు మన జిల్లాకు 8424 మంజూరు కావడం శుభసూచికమని జిల్లా అభివృద్ధి కోసం అధికారులు వరదల సమయంలో అప్రమత్తంగా పనిచేశారని 75 వ స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా 15 రోజులు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించమని జిల్లా సమగ్ర నివేదికను జిల్లా కలెక్టర్ వివరించారు.ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ బడే నాగజ్యోతి, ఐటీడీపీఓ అంకిత్, అదనపు కలెక్టర్ వై వి గణేష్, ఆర్డీవో కే రమాదేవి,  జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగ పద్మజ, జిల్లా రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ పల్ల బుచ్చయ్య,జిల్లా అధికారులు,జెడ్పిటిసిలు,ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, తహసిల్దార్లు,ఎంపిడిఓ లు,  సర్పంచులు,ఎంపిటిసిలు,ప్రజాప్రతినిధులు, ఆసరా  పింఛన్ లబ్దిదారులు, తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు