పేద ప్రజల హక్కుల కోసం పోరు చేస్తున్న సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ లో చేరిక

కురవి మండల కేంద్రంలోని బంగారి గూడెం గ్రామంకు చెందిన బాదావత్ దేవుడు,బాదావత్ దేవి లు పేద ప్రజల కోసం అనునిత్యం పోరాటం చేస్తున్న సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఉద్యమాలను చూసి ఆ పార్టీలో చేరుతున్నామని వారన్నారు.బాదావత్ దేవుడు బాదావత్ దేవి లను పార్టీ సీనియర్ నాయకులు చాట్ల నారాయణ, పి ఓ డబ్ల్యు జిల్లా నాయకురాలు పోతుల మీనమ్మ, సాధారంగా వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి చారి హరీష్, పిడిఎస్యు జిల్లా నాయకులు బానోతు దేవేందర్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.