పేద విద్యార్ధుల భవిష్యత్‌కు సహకారం అందిస్తాం- జెడ్పీ చైర్మన్‌ ఫుట్ట మధూకర్‌

జనం సాక్షి, మంథని : పేద వర్గాలకు చెందిన విద్యార్ధులు ట్రస్టు సేవలను సద్వినియోగం చేసుకోవాలని పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ కోరారు. మంథని పట్టణంలోని రాజగృహాలో పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఉచితంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసే కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించిన ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్బంగా జడ్పీ ఛైర్మన్ మాట్లాడుతూ.. ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ, విద్యాశాఖ గురుకుల పాఠశాలల్లో రాబోయే విద్యాసంవత్సరానికి 5వ తరగతిలో ప్రవేశానికి ఉమ్మడి ప్రవేశపరీక్షకు ఆన్‌లైన్‌, మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. అయితే
మారుమూల ప్రాంతాల్లోని నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్ధులకు పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్టు ద్వారా సహకారం అందించేందుకు ముందుకు రావడం జరుగిందన్నారు. ఆన్‌లైన్‌, మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకునేందుకు ఆర్థికంగా ఇబ్బందులు పడే వారి కోసం ట్రస్టు ద్వారా సాయం అందించడం జరుగుతుందని, 5వ తరగతిలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్ధుల ఇంటి వద్దకే ట్రస్టు సభ్యులు వచ్చి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేస్తారని ఆయన చెప్పారు. పేద వర్గాల్లో విద్యా పరిజ్ఞానాన్ని పెంపొందించాలన్నదే తమ లక్ష్యమని, ఇందు కోసం పుట్ట లింగమ్మ ట్రస్టు ద్వారా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఆయన చెప్పారు. దరఖాస్తు చేసుకునే విద్యార్ధులు తమ ట్రస్టు సభ్యులను సంప్రదించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.