పేరుకు పోయిన చెత్త కుప్పలు

3

– పారిశుద్ధ్య కార్మికుల సమ్మెతో తీవ్ర ఇక్కట్లు

హైదరాబాద్‌, జులై 8 (జనంసాక్షి):

మున్సిపల్‌ కార్మికుల సమ్మె మూడో రోజు కొనసాగుతోంది. ఉదయం నుంచే పారిశుద్ధ్య కార్మికులు రోడ్డెక్కారు. తమ డిమాండ్లను పరిష్కరించేవరకు సమ్మెను విరమించేది లేదని తేల్చిచెబుతున్నారు. దీంతో రోడ్లన్నీ చెత్తతో దర్శనమిస్తున్నాయి. కార్మిక సంఘాలతో మంత్రులు చర్చలు విఫలమయ్యాయి. మున్సిపల్‌ కార్మిక సంఘాల నేతలో ప్రభుత్వ తరపున మంత్రులు నాయిని నర్శింహారెడ్డి, ఈటల రాజేందర్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ చర్చలు జరిపారు. అయితే చర్చల్లో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో సమ్మె విరమించేందుకు కార్మిక సంఘాలు అంగీకరించలేదు. తమ డిమాండ్లను పరిష్కరించేంత వరకు సమ్మె విరమించేది లేదని కార్మిక సంఘ నేతలు ప్రభుత్వానికి స్పష్టం చేశారు. దీంతో కార్మికుల సమ్మెను పోలీసులు అణచివేస్తున్నారు. తెలంగాణలో మున్సిపల్‌ కార్మికుల సమస్య ఇంకా ఓ కొలిక్కి రాలేదు. తమ డిమాండ్లను నెరవేర్చాలని సమ్మె చేస్తున్నా.. ఎలాంటి పురోగతి లేదు. కార్మిక సంఘాల నాయకులతో చర్చలు జరిపిన ప్రభుత్వం.. చర్చల్లో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో సమ్మె యాథావిధిగా కొనసాగుతుందని కార్మిక సంఘాలు స్పష్టం చేశాయి. కనీస వేతనం రూ.14,170 చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు. తమ డిమాండ్ల సాధన కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్‌ కార్మికులు సమ్మెలో కొనసాగిస్తున్నారు. తమకు కనీస వేతనం 14 వేల 170 రూపాయలు చెల్లించాలని కార్మికులు డిమాండ్‌ చేస్తున్నారు. ఎన్నికల ముందు కాంట్రాక్ట్‌ కార్మికులను పర్మినెంట్‌ చేస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఆ హావిూని నిలబెట్టుకోవాలని కార్మిక సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. గత నెల 25నే కార్మికులు సమ్మెకు సిద్ధమైనప్పటికీ తమకు సమయం కావాలని ప్రభుత్వం కోరడంతో సమ్మెను వాయిదా వేశారు. కానీ, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో సమ్మెకు వెళ్లాయి. కానీ, పరిస్థితుల్లో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. తెలంగాణ వ్యాప్తంగా సుమారు 40వేల మంది కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. అన్ని మునిసిపాలిటీల్లో పారిశుధ్య సేవలు నిలిచిపోయాయి. మున్సిపల్‌ కార్మికుల సమస్యల పరిష్కరంపై ప్రభుత్వం స్పష్టమైన హావిూ ఇవ్వకపోవడంతో రోడ్లు అధ్వానంగా మారాయి. చెత్తాచెదారం పేరుకుపోయి దుర్గంధం వెదలజల్లుతోంది. ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మరోసారి కార్మిక సంఘాల నేతలతో చర్చలు జరిపి.. వారి న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. మొత్తంగా సమస్యలు పరిష్కరించేంత వరకూ సమ్మె ఆపేది లేదని మున్సిపల్‌ కార్మికులు అంటున్నారు.