పైలేరియా నివారణకు కృషి చేయాలి

సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): పైలేరియా వ్యాధి నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూర్యాపేట మున్సిపాలిటీ 48వ వార్డు కౌన్సిలర్ వెలుగు వెంకన్న అన్నారు.గురువారం ఆ వార్డులో డీఈసీ , ఆల్బండజోల్‌ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండేళ్ల వయస్సు పైబడిన వారందరూ ఈ మాత్రలు వేసుకోవచ్చని అన్నారు.ఈ మాత్రలు వేసుకోవడం వలన ఎటువంటి ఇబ్బంది ఉండదని, ప్రజలు అపోహలను నమ్మవద్దని అన్నారు.ఈ కార్యక్రమంలో గిరినగర్ పిహెచ్ సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీకాంత్ వర్మ , సిబ్బంది ఏకస్వామి, నరేష్ , ఆశావర్కర్లు , అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.