పైశాచిక ”ఎన్‌కౌంటర్”
– ఈ తెలంగాణ మేం కోరుకోలేదు
– ప్రోఫెసర్ హరగోపాల్
హైదరాబాద్,సెప్టెంబర్30(జనంసాక్షి): వామపక్షాలు, ప్రజాసంఘాలపై తెలంగాణ సర్కారు.. నిర్బంధాన్ని ప్రయోగించడంపై ప్రొఫెసర్ హరగోపాల్ తీవ్రంగా ఆక్షేపించారు. మనం కోరుకున్న తెలంగాణ ఇది కాదన్నారు. బుధవారం మాట్లాడుతూ…బూటకపు ఎన్‌కౌంటర్లను ఖండించిన ఆయన.. నూతన తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం.. ఎన్‌కౌంటర్లతో పరిపాలన కొనసాగించడం మంచిది కాదన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగించాలన్నారు. మనం కోరుకున్న తెలంగాణ ఇది కాదన్నారు. ఏడాదిన్నరగా మావోలు ఇక్కడ ఎలాంటి విధ్వంసానికి పాల్పడ్డారని ఎన్‌కౌంటర్ చేశారని అన్నారు. ఇద ఇది సరికాదన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారిని కాల్చేస్తారా అని ప్రశ్నించారు.కేసీఆర్ ఒక్కడ పోరాడితే తెలంగాణ రాలేదన్నారు.