పొంగిపొర్లుతున్న శబరి, గోదావరి నదులు
ఖమ్మం, జూలై 28 : గత వారం రోజులుగా భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రల్లో కురుస్తున్న వర్షాల వల్ల శబరి, గోదావరి నదులు తాలిపేరు ప్రాజెక్టు పొంగి ప్రవహిస్తోంది. కూనవరం వద్ద 20 అడుగుల స్థాయికి వరద నీరు చేరింది. వరద రావడంతో శబరి నదీ వడ్డున ఉన్న శివలింగం నీటమునిగింది. శబరి వరద ప్రవాహాన్ని విక్షించేందుకు తండోపతండాలుగా స్థానికులు శబరి బ్రిడ్జిపైకి వస్తున్నారు. ఇదిలా ఉండగా, కూనవరం వద్ద గోదావరి సమీపంలో ఉన్న రెండు మోటార్లు వరద నీటిలో మునిగిపోవటంతో నల్లాలో నీరు రావడం లేదు. ఈ కారణంగా స్థానికులు శబరి నదీలో బురదనీటిని ఆటోల ద్వారా తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.