పొక్లెయిన్ డ్రైవర్‌పై డీజిల్ పోసి నిప్పంటించిన దుండగులు
భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలం మండలం గంగారం వద్ద అటవీశాఖ పొక్లెయిన్‌కు దుండగులు నిప్పు పెట్టారు. అడ్డుకోవడానికి యత్నించిన పొక్లెయిన్ డ్రైవర్‌పై డీజిల్ పోసి నిప్పంటించారు. తీవ్రగాయాలపాలైన డ్రైవర్‌ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో మొత్తం ఆరుగురు దుండగులు పాల్గొన్నట్లు డ్రైవర్ తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలింపు చేపట్టారు.