పొత్తులుంటాయి .. చర్చలు జరుగుతున్నాయి

` టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి
హైదరాబాద్‌(జనంసాక్షి):పొత్తులపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. మంగళవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విూడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.అభ్యర్థుల ఎంపిక వార్తలపై విూడియా సంయమనం పాటించాలని కోరారు.’’అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. అభ్యర్థుల ఎంపిక విషయంలో కాంగ్రెస్‌కు ఓ విధానం ఉంది. అన్ని అంశాలు బేరీజు వేసుకున్నాకే అభ్యర్థిత్వం ఖరారవుతుంది. ప్రస్తుతం ఎమ్మెల్యే టికెట్లపై మాత్రమే నిర్ణయం తీసుకుంటున్నాం. కాంగ్రెస్‌ నేతలకు ఇంకా అనేక అవకాశాలు ఉన్నాయి. ఎంపీ, ఎమ్మెల్సీ, ఇతర పదవులు.. ఇలా చాలా అవకాశాలు ఉన్నాయి. పార్టీ కోసం పనిచేసిన వారిని తప్పకుండా గుర్తించి గౌరవిస్తాం.కొందరు ఐఏఎస్‌ అధికారులు భారాస కోసం పనిచేస్తున్నారు. అనేక హోదాల్లో రిటైరైన వారిని భారాస కోసం పనిచేసే అధికారులు మోహరించారు. భారాస అనుకూల అధికారుల వివరాల సేకరణకు కమిటీని నియమిస్తున్నాం. కాంగ్రెస్‌పై తప్పుడు వార్తలు రాస్తే చర్యలు తీసుకుంటాం. పింఛన్లు తప్ప కోడ్‌ అమల్లోకి వచ్చాక ఓటర్లకు నిధులు విడుదల చేయకూడదు. ఐఏఎస్‌ల నుంచి ఎమ్మార్వో వరకు కొందరు అధికారులు.. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు’’ అని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.
కాంగ్రెస్‌తో రాజకీయ అవగాహన కుదిరింది

(సీట్ల విషయమే ఖరారు కావాలి
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
హైదరాబాద్‌(జనంసాక్షి):రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీతో రాజకీయ అవగాహన కుదిరిందని.. ఇంకా సీట్ల విషయమే కుదరలేదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పష్టం చేశారు. సీపీఐ, సీపీఎం చెరో ఐదు సీట్లు చొప్పున ప్రతిపాదన పెట్టామని వివరించారు. హైదరా బాద్‌లోని సీపీఐ కార్యాలయం లో జరిగిన సమావేశంలో.. సీపీఐ ము ఖ్య నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్‌ నుంచి ఇంకా ఎలాంటి సమాధానం రా లేదని తెలిపారు. హైదరాబాద్‌లోని సీపీ ఐ కార్యాలయంలో జరిగిన సమా వేశంలో ఆయన పాల్గొన్నారు. ఎన్నికల వేళ పొత్తులు అనేవి ఎప్పుడు ప్రసవ వేదన లాంటివేనని నారాయణ అన్నారు. చర్చలు కొలిక్కి వచ్చాక తామే ప్రకటన విడుదల చేస్తామని స్పష్టం చేశారు.పొత్తు, సీట్లపై ఊహాగానాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ఛత్తీస్‌గఢ్‌లో 14 చోట్ల సీపీఐ పోటీ చేస్తోందన్నారు. సీపీఐ, సీపీఎం కలిసి వామపక్షాలు మొత్తం 40 సీట్లలో పోటీ చేస్తున్నట్లు చెప్పారు. మధ్యప్రదేశ్‌?లో సీపీఐ 15 స్థానాల్లోనూ, సీపీఎం 14 స్థానాల్లోనూ పోటీ చేస్తున్నాయని తెలిపారు. అలాగే రాజస్థాన్‌?లో సైతం సీపీఐ 14 స్థానాల్లోనూ, సీపీఎం 15 స్థానాల్లోనూ పోటీ చేయనుందన్నారు. ఎన్నికల ముందు అధికార పార్టీలు.. అధికారులను బదిలీ చేసుకున్న అంశంపై కేంద్ర ఎన్నికల సంఘా నికి లేఖ రాసినట్లు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. ‘‘తెలంగాణలో మా ప్రతిపాదన పెట్టాం. మేము ఐదు సీట్లు.. సీపీఎం ఐదు సీట్లలో పోటీ చేయడానికి సిద్ధమయ్యాము. అందుకు సంబంధించిన లిస్ట్‌?ను మా వాళ్లు వారికి ఇచ్చారు. అందుకు సంబంధించిన విషయాలపై మాట్లాడుతున్నారు. ఇందులో సెంట్రల్‌? వాళ్లు కూడా జోక్యం చేసుకున్నారు. కేంద్రం నుంచి అక్కడ మాట్లాడాము. రాజా, నేను, అజీజ్‌? బాషా కలిసి ఏఐసీసీ ప్రెసిడెంట్‌? మల్లికార్జున ఖర్గేతో చర్చించాము. ఇక్కడ కూడా సీపీఎంతో వేరేగా సీపీఐతో వేరేగా చర్చలు జరిపారు. వాస్తవానికి సీపీఐ, సీపీఎం సీట్లకు తగువు లేదు. ఈ విషయంపై కాంగ్రెస్‌? పార్టీ స్క్రీనింగ్‌? కమిటీ చర్చలు జరుపుతుందని అన్నారు. ఎన్నికలకు ముందు పథకాలను ప్రవేశపెట్టడం అనేది ఎన్నికల ఉల్లంఘన కిందకే వస్తోందని నారాయణ అన్నారు. ఈ విధానాన్ని ఆరు నెలల ముందు నుంచే అమలు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. దేశం మొత్తంలో ఇండియా కూటమికి అనుకూలంగా ఉంటాం.. కానీ రాష్ట్రాల విషయానికి వచ్చేసరికి పొత్తు కుదిరిన చోట అనుకూలంగా ఉంటాం.. లేకపోతే తమకు తామే పోటీ చేస్తామని సీపీఐ కార్యదర్శి నారాయణ చెప్పారు. ఈ సమావేశంలో సీపీఐ జాతీయ కార్యదర్శి అజీజ్‌? బాషా, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.