పోటాపోటీగా క్షిపణిల ప్రయోగం

– ఉత్తర కొరియాకు ధీటుగా దక్షిణ కొరియా క్షిపణి ప్రయోగం
సియోల్‌, నవంబర్‌30(జ‌నంసాక్షి) : ఉత్తరకొరియా విధ్వంసక ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి(ఐసీబీఎం)ను బుధవారం ప్రయోగించిన సంగతి తెలిసిందే. అయితే ఉ.కొరియా ఈ క్షిపణిని ప్రయోగించిన కొద్ది నిమిషాల్లోనే దక్షిణ కొరియా కూడా క్షిపణిని ప్రయోగించింది. ఉ.కొరియాకు దీటుగా సమాధానం చెప్పడానికే ఈ క్షిపణిని ప్రయోగించినట్లు ద.కొరియా రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. /ూజధాని సియోల్‌ విూదుగా ఈ క్షిపణిని ప్రయోగించినట్లు ద.కొరియా పేర్కొంది. ఉ.కొరియా చేపట్టే ప్రయోగాలు త్వరలో మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం ఉందని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్న సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఉ.కొరియాను ఉగ్రదేశంగా ప్రకటించిన నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ యున్‌ ఈ బాలిస్టిక్‌ క్షిపణిని ప్రయోగించారు.  విషయమై ట్రంప్‌.. జపాన్‌ ప్రధాని షింజో అబే, ద.కొరియా అధ్యక్షుడు మూన్‌ జేఇన్‌లతో అత్యవసరంగా ఫోన్లో విడివిడిగా చర్చలు జరిపారు. మరోవైపు జపాన్‌ అభ్యర్థనపై ఐరాస భద్రతా మండలి(యూఎన్‌ఎస్‌సీ) అత్యవసరంగా సమావేశం అయ్యేందుకు అంగీకరించింది.